కత్రినాకు బర్త్‌డే విషెస్‌ చెప్పిన అలియా

Alia Bhatt Wishes To Birthday Girl Katrina Kaif  - Sakshi

ముంబై : బాలీవుడ్‌ బ్యూటీ కత్రినాకైఫ్‌ మంగళవారం నాడు 36వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకొనేందుకు కుటుంబ సభ్యులతో కలిసి మెక్సికో వెళ్లింది​​. ఈ క్రమంలో మెక్సికో బీచ్‌లో బికినీతో దిగిన ఈ ముద్దుగుమ్మ ట్రప్‌ తాలూకు ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ అభిమానులను ఉర్రూతలుగిస్తోంది. దీంతో అటు సెలబ్రిటీలు, ఇటు అభిమానుల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. హీరోయిన్‌ అలియా భట్‌ కూడా కత్రినాకు శుభాకాంక్షలు తెలిపింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ఇద్దరు కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ..‘‘ప్రియమైన క్యాటీకి జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. జీవితంలో నిరంతరం ముందుకు సాగాలని ఆశిస్తున్నా’’ అంటూ విషెస్‌ తెలిపింది.

కత్రినా మాజీ ప్రియుడు రణ్‌బీర్‌ కపూర్‌తో అలియా డేటింగ్‌ చేస్తుందని... అప్పటి నుంచి వీరిద్దరూ మాట్లాడుకోవడం లేదనే  వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ అవాస్తవమని ఇద్దరూ కొట్టిపారేశారు. ఓ ఇంటర్వ్యూలో తన  పుట్టిన రోజు వేడుకల గురించి కత్రీనా మాట్లాడుతూ.. పుట్టినరోజు అనేది చాలా సరాదాకరమైన అంశమని, దీనివల్ల కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, మనకు నచ్చిన వారితో కలిసి గడపటానికి సమయం దొరుకుతుందని తెలిపింది. ఎక్కువ రిజర్వ్‌డ్‌గా ఉండే కత్రినా తనకు సంబంధించిన ఏ వేడుకలను అయినా అత్యంత సన్నిహితులతోనే జరుపుకుంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సారి కూడా పుట్టిన రోజు వేడుకలు సాదాసీదాగా జరుపుకొంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top