లవ్‌ ఫెయిల్యూర్స్‌ బాధపడకండి! | Sakshi
Sakshi News home page

లవ్‌ ఫెయిల్యూర్స్‌ బాధపడకండి!

Published Sun, Feb 18 2018 1:17 AM

Love failures do not bother! - Sakshi

వాలెంటైన్స్‌ డే.. ప్రేమికుల దినోత్సవం అనగానే అందరూ తమ ప్రేమను ప్రియుడు లేదా ప్రియురాలితో పంచుకుంటూ ఆనందంగా గడుపుతారు. బహుమతులు, గ్రీటింగ్‌ కార్డులు, సినిమాలు ఏదో ఒక రూపంలో వారి ప్రేమను పంచుకుంటారు.  ఈ సరదాలు, సంతోషాలు ప్రేమ సఫలం అయిన వారి విషయంలో బాగానే ఉంటాయి. మరి ప్రేమ విఫలం అయిన వారు.. వన్‌ సైడ్‌ లవర్స్‌ సంగతేమో.. ఆ ఏముంది.. తన ప్రేమసి లేదా ప్రియుడిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారనుకుంటున్నారా..? ప్రేమను అంగీకరించని ప్రియుడు.. ప్రేయసిపై కసి తీర్చుకోవాలనుకునే వారికి బొంపాస్‌ అండ్‌ పార్‌ అనే డిజైనర్‌ స్టూడియో సరికొత్త ఐడియా తీసుకొచ్చింది.

మీ మాజీ లవర్‌ ఫొటోను షూలోని సోల్‌పై ముద్రించి ఇస్తోంది ఆ స్టూడియో. ఇందుకు మీ మాజీ లవర్‌ ఫొటోను వారికి పంపిస్తే సోల్‌పై ముద్రించి మీకు అందజేస్తుంది. ఆ తర్వాత మీ పాదానికి సరిపోయేలా కత్తిరించి.. మీ షూలో పెట్టుకుని వాడుకుంటే మనశ్శాంతిగా ఉంటుందని చెబుతోంది ఆ కంపెనీ. అయితే ఈ ఐడియా కొత్తదేం కాదండోయ్‌.. శత్రువుల ఫొటోలను చెప్పులపై ముద్రించి వేసుకుంటే వారిని ఓడించినట్లేనని ప్రాచీన ఈజిప్టులో ఈ నమ్మకం ఉండేదట.  
 

Advertisement
Advertisement