ఆ ఉగ్రవాదులను వదలొద్దు.. దాడులు చేద్దాం | Sakshi
Sakshi News home page

ఆ ఉగ్రవాదులను వదలొద్దు.. దాడులు చేద్దాం

Published Tue, Mar 31 2015 12:06 PM

ఆ ఉగ్రవాదులను వదలొద్దు.. దాడులు చేద్దాం

ఒట్టోవా: సిరియాలోని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్పై అమెరికా తరహాలో వైమానిక దాడులు జరిపి మట్టుపెట్టడానికి కెనడా చట్టసభల ప్రతినిధులు తీర్మానించారు. ఇందుకోసం ఓటింగ్ నిర్వహించగా 142మందిలో 129 మంది మద్దతు తెలిపారు. ప్రతిపక్షాల్లో కొద్ది మంది సభ్యులు మాత్రమే ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఈ విషయంపై కెనడా ప్రధాని స్టీపెన్ హర్పర్ విలేకరులతో మాట్లాడుతూ తమకు తమ దేశ పౌరుల భద్రతే తొలి ప్రాధాన్యం అని చెప్పారు. స్వదేశంలో ఉన్నా.. విదేశంలో ఉన్నా వారిని ఉగ్రవాదుల భారినుంచి రక్షించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు.

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఐఎస్ ఉగ్రవాదుల ప్రభావం ఉన్న దేశాల్లో వారిని అంతమొందించేందుకు అమెరికా దాడులు జరుపుతుండగా దానితో కెనడా గత నవంబర్లో జత కట్టింది. ఇందులో భాగంగా 2016 మార్చి 30 వరకు ఆ విధానం కొనసాగించేందుకు తాజాగా ఓటింగ్ నిర్వహించి ఆ ప్రతిపాదనను ఆమోదించింది. సిరియాతోపాటు ఇరాక్ సరిహద్దులో ఉన్న ఐఎస్ స్థావరాలపై కూడా దాడులు నిర్వహించాలని కెనడా నిర్ణయించింది. ఈ దేశాల్లో తమ పౌరులు ఉగ్రవాద దాడుల్లో చనిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement