మీ జోక్యం..మాకు ఇబ్బంది కరం

మీ జోక్యం..మాకు ఇబ్బంది కరం

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పునర్నిర్మాణంపై కాంట్రాక్ట్‌ సంస్థల సందేహాలు

భవన నిర్మాణం, వాణిజ్య సముదాయాలపై రైల్వే జోక్యం పట్ల అభ్యంతరం

ఆసక్తి చూపిన 16  జాతీయ, అంతర్జాతీయ సంస్థలు

సిటీబ్యూరో: అంతర్జాతీయ ప్రమాణాలు, ఆధునిక సదుపాయాలతో చేపట్టనున్న  సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పునర్నిర్మాణంపై పలు జాతీయ, అంతర్జాతీయ నిర్మాణ సంస్థలు తమ అనుమానాలను వెలిబుచ్చాయి. ఒకవైపు  ప్రైవేట్‌ సంస్థలకు ఆహ్వానం పలుకుతూనే మరోవైపు  భవనాల నిర్మాణం సహా అనేక  అంశాల్లో  రైల్వే ఇంజనీరింగ్‌ నిపుణులు అడుగడుగునా జోక్యం చేసుకోవడం తమకు ఇబ్బందికరమని పలు సంస్థలు బాహాటంగానే పేర్కొన్నాయి. రైల్వేస్టేషన్‌ రీమోడలింగ్‌పై దక్షిణ మధ్య రైల్వే గత ఫిబ్రవరిలో  ప్రీబిడ్డింగ్‌కు  దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ  మేరకు 16 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఈ  ప్రీబిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. మార్చి 23 వరకు కొనసాగిన  ఈ  ప్రక్రియలో నిర్మాణ సంస్థలు సుమారు  200 సందేహాలను వ్యక్తం చేశాయి.  నిర్మాణ పరంగా ఎదురయ్యే  ఇబ్బందులు, సాంకేతిక సమస్యలపై ఆయా  సంస్థలు దృష్టి  సారిం చాయి. ముఖ్యంగా  రైల్వే శాఖ అనవసరమైన జోక్యం  పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైనట్లు సమాచారం.

విమానాశ్రయం తరహాలో...

అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా  అత్యాధునిక సదుపాయాలతో  స్టేషన్‌  పునర్నిర్మాణం, సుందరీకరణ, ప్లాట్‌ఫామ్‌ల ఆధునీకరణ,  ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలు, మల్టీ లెవల్‌ పార్కింగ్, ప్రత్యేక ర్యాంప్‌లు, విశ్రాంతి గదులు, కేటరింగ్, పరిశుభ్రమైన తాగునీరు, ఏటీఎంలు, ఫార్మా, పటిష్టమైన భద్రతా వ్యవస్థ,  అన్ని ప్లాట్‌ఫామ్‌లకు ఎస్కలేటర్లు, లిఫ్టులు వంటి రూ.282  కోట్ల  విలువైన  అత్యాధునిక, అంతర్జాతీయ విమానాశ్రయం తరహా ప్రయాణ సదుపాయాలను కల్పించేందుకు నిర్ణయించింది. ఇందుకు  స్టేషన్‌ చుట్టూ  ఉన్న  5.62 ఎకరాల  స్థలాన్ని, 96,243  చదరపు మీటర్‌ల  స్టేషన్‌ ప్రాంగణాన్ని 45  ఏళ్ల  పాటు  ప్రైవేట్‌  సంస్థలకు కట్టబెట్టేందుకు  దక్షిణమధ్య రైల్వే  గ్లోబల్‌  టెండర్లకు  ఆహ్వానం  పలికింది. ఈ  ప్రాజెక్టు  పూర్తయితే రైళ్ల నిర్వహణకు  మాత్రమే  దక్షిణమధ్య రైల్వే పరిమితమవుతుంది. మిగతా సదుపాయాలన్నీ  ప్రైవేట్‌  సంస్థల నిర్వహణలోకి వెళ్తాయి.

అనుమతుల బాధ్యత ఎవరిది...

నిజాం కాలంనాటి  చారిత్రక స్టేషన్‌ భవనం ఏమాత్రం  చెక్కుచెదరకుండా అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో  స్టేషన్‌ను పునర్నిర్మించాలని  ప్రతిపాదించారు.  హైదరాబాద్‌  చారిత్రక, కళాత్మక, విలక్షణతను ప్రతిబింబించే విధంగా  స్టేషన్‌ నిర్మాణం ఉండాలని  ప్రీబిడ్డింగ్‌లో  ప్రతిపాదించారు. ఇలాంటి అంశాలపై  పలు కన్సార్టియంలు  సుముఖత  వ్యక్తం చేశాయి. కానీ  తమకు  ఇచ్చే స్థలంలో కమర్షియల్‌ భవనాల నిర్మాణానికి  రాష్ట్రప్రభుత్వం నుంచి  రైల్వేశాఖ అనుమతులిప్పిస్తుందా అనే అంశంపైన ప్రీబిడ్డింగ్‌లో ఎలాంటి స్పష్టత లేదని పలువురు  అభిప్రాయపడ్డారు. తమ వ్యాపార ప్రయోజనాలకు అనుగుణమైన భవనాలను నిర్మించేందుకు అవకాశం ఉంటుందా,  రైల్వే ప్రమాణాలు పాటించాలా అనే అంశం కూడా ముందుకు వచ్చింది.

రైల్వేబోర్డుకు నివేదిక...

ప్రీ బిడ్డింగ్‌లో పాల్గొన్న టాటా, జీఎమ్మార్, ఎల్‌అండ్‌టీ వంటి  16 సంస్థలు, కన్సార్టియంల నుంచి వ్యక్తమైన 200 సందేహాలపైన దక్షిణమధ్య రైల్వే ఒక నివేదికను రూపొందించింది. ఈ నివేదికను ఇటీవలే రైల్వేబోర్డులోని  స్టేషన్‌ రీడెవలప్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు అందజేసినట్లు  దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. ఈ సందేహాలను నివృత్తి చేసిన అనంతరమే తదుపరి కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు మే 23 వరకు నిర్మాణ టెండర్లకు అనుమతినిచ్చిన నేపథ్యంలో  త్వరలోనే  అన్ని అంశాలపైన  ఒక స్పష్టత వస్తుందన్నారు. మే 24న టెండర్లను  ఓపెన్‌ చేసి  ప్రాజెక్టును కేటాయించచనున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Read also in:
Back to Top