♦ కరువును ఎదుర్కొనేందుకు సాయం చేయండి
♦ కేంద్ర మంత్రులకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి
♦ రాష్ట్రంలో కరువు పరిస్థితులపై సమీక్షించిన కేంద్ర మంత్రులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత సాయం అందించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఒకరోజు పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్రసింగ్, తాగునీటి సరఫరా శాఖ మంత్రి రాంకృపాల్ యాదవ్‌లు మంగళవారం ఇక్కడి కరువు పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను మంత్రి కేటీఆర్ వారికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 231 కరువు మండలాల కోసం మొత్తం రూ.3,064 కోట్లు కావాలని కోరితే... కేంద్రం రూ.791కోట్లు మాత్రమే మంజూరు చేసిందని చెప్పారు. తాగునీటి సరఫరా కోసం రూ.555 కోట్లు కోరితే... ఇప్పటివరకు అందినది రూ.72కోట్లు మాత్రమేనని వివరించారు. ఈ రెండు అంశాల్లో మరింత సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో నీతి ఆయోగ్ ద్వారా మరిన్ని నిధులు తీసుకునేందుకు ప్రయత్నించాలని కేంద్ర మంత్రులు సూచించారు. గ్రామాల్లో కొన్ని రకాల కరువు పనులకు (పశువుల కోసం తాగునీటి తొట్లు, ఇంకుడు గుంతలు వంటివాటికి) ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ నిధులను వినియోగించుకోవాలని చెప్పారు.
ఉపాధికి మరో రూ.వెయ్యి కోట్లు ఇవ్వండి
రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం ద్వారా శాశ్వత ఆస్తుల రూపకల్పన చేస్తున్నామని కేంద్ర మంత్రులకు మంత్రి కేటీఆర్ వివరించారు. వెయ్యి గ్రామ పంచాయతీ భవనాలను, 1,100 అంగన్వాడీ కేంద్రాలను ఈ ఏడాది నిర్మించనున్నట్లు చెప్పారు. స్వచ్ఛ భారత్ పథకం కింద రాష్ట్రంలోని గ్రామాల్లో చెత్త సేకర ణకు పెద్ద సంఖ్యలో ట్రైసైకిళ్లు కొనుగోలు చేశామని, ప్రతి గ్రామానికి ఒక డంపింగ్ యార్డు ఉండేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఉపాధి హామీ పథ కం కింద కరువు మండలాల్లో అదనపు పనిదినాల కల్పనకు మరో రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని కోరారు. దీంతో రాష్ట్రానికి నిధుల కొరత లేకుండా చూస్తామని కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్ హామీ ఇచ్చారు. ఉపాధి పథకం కింద దేశవ్యాప్తంగా త్వరలోనే మరో రూ.8వేల కోట్లు విడుదల చేయనున్నట్లు చెప్పారు.
మిషన్ భగీరథకు ప్రశంసలు
రాష్ట్రంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా మిషన్ భగీరథ ప్రాజెక్టును చేపట్టడం అభినందనీయమని కేంద్ర మంత్రులు ప్రశంసించారు. భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలకు ఈ ప్రాజెక్టు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం, నిధుల సేకరణ అంశాలను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ఈ ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు త్వరలోనే మరోసారి వస్తానని, కేంద్రం తరఫున సాయం అందించేందుకు కృషి చేస్తానని బీరేంద్రసింగ్ హామీ ఇచ్చారు. గ్రామాల్లో అంతర్గత పైప్‌లైన్ పనులకు ఉపాధి హామీ పథకం నిధులను, పంచాయతీల అభివృద్ధి నిధులను వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ స్పెషల్ సీఎస్ ఎస్పీ సింగ్, డెరైక్టర్ అనితా రాంచంద్రన్, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి, సలహాదారు జ్ఞానేశ్వర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మరిన్ని నిధులివ్వండి
Published Wed, Apr 20 2016 12:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement