హోదా వల్ల ఏపీకి నష్టమే : కేంద్రమంత్రి సుజనా | Sakshi
Sakshi News home page

హోదా వల్ల ఏపీకి నష్టమే : కేంద్రమంత్రి సుజనా

Published Sun, Sep 11 2016 6:33 PM

హోదా వల్ల ఏపీకి నష్టమే : కేంద్రమంత్రి సుజనా - Sakshi

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్కు హోదా ఇస్తే రాష్ట్రానికి నష్టమే జరుగుతుందంటూ కేంద్ర మంత్రి సుజనా చౌదరి కొత్త నిర్వచనం చెప్పారు. హైదరాబాద్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పరిశ్రమల రాయితీలకు, ప్రత్యేక హోదాకు సంబంధం లేదని... ఇవి తన అభిప్రాయాలన్నారు. ప్రత్యేక హోదా వస్తే ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పడం చాలా తప్పని చెప్పారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం కావాలనే దానిపై రెండేళ్లుగా అధ్యయనం చేస్తున్నామన్నారు. హోదాపై కొందరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని...రాష్ట్రానికి హోదా వస్తే అన్ని వసతులు వస్తాయని ఎక్కడా లేదంటూ పల్లవి మార్చారు. టెలిగ్రామ్లు లేవు...అవి కావాలంటే ఎలా ? సుజనా ఎదురు ప్రశ్న వేశారు. అంతర్జాతీయ సరిహద్దులు, గిరిజన రాష్ట్రాలకే హోదా ఇచ్చారని చెప్పారు. కేంద్రం బ్రహ్మండమైన ప్యాకేజీ ఇచ్చిందని కితాబిచ్చారు. ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కేంద్రం రాష్ట్రానికి పూర్తి న్యాయం చేసినట్లేనన్నారు. ఒక్క నయా పైసా కూడా ఏపీకి నష్టం రాదని లెక్కలు చెప్పుకోచ్చారు. పోలవరానికి 100 శాతం నిధులు ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకుందని...ప్యాకేజీపై ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని సూచించారు. చట్టంలో ఉన్న అన్ని అంశాలను ఎప్పుడైనా కేంద్రం ఇచ్చి తీరాల్సిందేనని...హోదాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. 
 
జైరాం రమేష్తో తాను మాట్లాడానని రూ.60 వేల కోట్లు వస్తాయని ఆయనెప్పుడూ చెప్పలేదని తనతో చెప్పారని సుజనా అన్నారు.  ప్రత్యేక హోదాపై పవన్ కల్యాణ్ మిస్ లీడ్ చేస్తాడని తాను అనుకోన్నారు. తెలంగాణ రాష్ట్రం సెంటిమెంట్ వేరు...ఎకనామిక్స్ వేరన్నారు. రాజకీయ పోరాటం 2019లో చేసుకుందామన్నారు. 10 నుంచి 15 ఏళ్లలో ఏపీ రూపురేఖలు మారుతాయని సుజనా అన్నారు. రైల్వే జోన్ అంశంపై చర్చ జరుగుతోందని...90శాతం విశాఖకే రైల్వే జోన్ వచ్చే అవకాశముందని సుజనా చౌదరి తెలిపారు. 

Advertisement
Advertisement