మే 4 హ్యాపీ బర్త్ డే | Sakshi
Sakshi News home page

మే 4 హ్యాపీ బర్త్ డే

Published Mon, May 4 2015 12:16 AM

మే 4 హ్యాపీ బర్త్ డే

ఈరోజు మీతో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు: దర్శకుడు దాసరి నారాయణరావు, నటి త్రిష
 
ఈ రోజుపుట్టిన వారి వ్యక్తిగత సంఖ్య 8. వీరికి ఆధ్యాత్మికంగా ఈ ఏడాది చాలా బాగుంటుంది. డాక్టర్లకు ప్రాక్టీస్  పెరుగు తుంది. వృత్తులలో ఉన్నవారికి అధికాదాయం లభిస్తుంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆచితూచి మాట్లాడాలి.

యోగా, ధ్యానం వంటి వాటిలో శిక్షణ తీసుకుంటే మీ పనులలో పట్టుసాధిస్తారు. కేతుగ్రహ జపం చేయించుకుంటే మంచిది. లక్కీ నెంబర్స్: 5, 6, 8.
 - ఎస్.ఎ.రహిమాన్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్
 

Advertisement
Advertisement