జూరాలకు తగ్గిన వరద | Sakshi
Sakshi News home page

జూరాలకు తగ్గిన వరద

Published Tue, Sep 20 2016 11:44 PM

Increase to Jurala

జూరాల : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్‌కు వరద ప్రవాహం తగ్గింది. ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గడంతో మంగళవారం ఇన్‌ఫ్లో తగ్గింది. ప్రాజెక్టు రిజర్వాయర్‌ పూర్తి స్థాయి నీటి నిల్వ 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.35 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి 16 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా రిజర్వాయర్‌ నుంచి కుడి, ఎడమ కాలువకు 450 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సమాంతర కాలువ ద్వారా 750 కూసెక్కులను విడుదల చేస్తున్నారు. కోయిల్‌ సాగర్‌ ఎత్తిపోతలకు 630 క్యూసెక్కులు, భీమా లిఫ్టు 1 ద్వారా 1300 క్యూసెక్కులు, లిప్టు 2 ద్వారా 750 క్యూSసెక్కులు విడుదల చేస్తున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1500 క్యూసెక్కుల వదులుతున్నారు. జూరాల జల విద్యుత్‌ కేంద్రం ద్వారా 8 వేల క్యూసెక్కులను విడుదల చే స్తున్నారు. విద్యుదుత్పత్తి అనంతరం దిగువకు వదులుతున్నారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement