యువతి ముందే కారు డ్రైవర్‌ అసభ్యచర్య | Sakshi
Sakshi News home page

యువతి ముందే కారు డ్రైవర్‌ అసభ్యచర్య

Published Tue, Mar 6 2018 6:49 PM

Car driver Indecent behavior before the young lady - Sakshi

సాక్షి, కర్ణాటక(శివాజీనగర) :  ఓ కారు డ్రైవర్‌ నగరంలోని వసంతనగర మౌంట్‌ కార్మెల్‌ కాలేజీ బస్టాండ్‌లో నిలుచున్న యువతిని చూచి హస్త ప్రయోగం చేసుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. అతని కోసం ప్రస్తుతం పోలీసులు తీవ్ర గాలింపు చేపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 3న వసంతనగర మౌంట్‌ కార్మెల్‌ కాలేజీ బస్సు స్టాప్‌ వద్ద యువతి బస్సు కోసం వేచి చూస్తుంది. ఆ సమయంలో కేఏ–53సీ1877 నెంబర్‌ కారుకు సంబంధించిన డ్రైవర్‌ హస్త ప్రయోగం చేసుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. యువతిని చూచిన ఆయన తనవైపు చూస్తూ ప్యాంట్‌ విప్పి హస్త ప్రయోగం చేసుకున్నాడు. 

దీంతో భయంవేసి తాను వేరేచోటికి వెళ్లినా కూడా అక్కడికి కారు నడపుకుంటూ వచ్చి మళ్లీ హస్త ప్రయోగం చేసుకున్నాడు. దీంతో తనను మానసిక హింసకు గురిచేశాడని బాధితురాలైన యువతి పోలీసుకు ఫిర్యాదు చేశారు. యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న హై గ్రౌండ్స్‌ పోలీసులు నిందితుడి కోసం తీవ్ర గాలింపు చేపట్టారు. పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్‌ 294, 509 క్రింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకున్నారు. బహిరంగ ప్రదేశంలో అసభ్యకరంగా ప్రవర్తించిన కారు డ్రైవర్‌ కోసం పోలీసులు తీవ్ర గాలింపు చేపట్టారు. 

Advertisement
Advertisement