రూపాయి 43 పైసలు డౌన్‌ | Sakshi
Sakshi News home page

రూపాయి 43 పైసలు డౌన్‌

Published Wed, May 30 2018 1:48 AM

Rupee 43 paise down  - Sakshi

ముంబై: గత మూడు రోజులుగా కొంత కోలుకున్న రూపాయి.. మంగళవారం మళ్లీ క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే 43 పైసలు తగ్గి 67.86 వద్ద క్లోజయ్యింది. నెలాఖరులో దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్‌ వెల్లువెత్తడం దీనికి ఒక కారణం. ఆసియా, వర్ధమాన దేశాల కరెన్సీలు క్షీణించడం, ఇటలీలో రాజకీయ ప్రతికూల రాజకీయ పరిణామాలు.. తదితర అంశాలతో ఫారెక్స్‌ మార్కెట్‌ సెంటిమెంటు బేరిష్‌గా మారినట్లు పరిశీలకులు తెలిపారు.

ఇటు దేశీ స్టాక్‌ మార్కెట్లోనూ అమ్మకాలు వెల్లువెత్తడం సైతం రూపాయి బలహీనపడటానికి కారణమైనట్లు పేర్కొన్నారు. అయితే, ఆర్‌బీఐ జోక్యంతో రూపాయి పతనానికి కాస్త అడ్డుకట్ట పడి ఉంటుందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. ఇంటర్‌–బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో క్రితం ముగింపు 67.43తో పోలిస్తే మంగళవారం మరింత బలహీనంగా 67.62 వద్ద రూపాయి ట్రేడింగ్‌ ప్రారంభమైంది. రోజంతా ఒత్తిడిలోనే కొనసాగింది.ఒక దశలో 68 స్థాయికి పడిపోయింది. చివరికి 43 పైసల క్షీణతతో 67.86 వద్ద క్లోజయ్యింది.  

Advertisement
Advertisement