ఎగవేతదారు నిర్వచనానికి ఆర్‌బీఐ సవరణ | Sakshi
Sakshi News home page

ఎగవేతదారు నిర్వచనానికి ఆర్‌బీఐ సవరణ

Published Tue, Dec 23 2014 12:37 AM

ఎగవేతదారు నిర్వచనానికి ఆర్‌బీఐ సవరణ

ముంబై: ఉద్దేశపూర్వక ఎగవేతదారుల నిర్వచనాన్ని రిజర్వ్ బ్యాంక్ సవరించింది. ఇకపై స్థోమత ఉన్నప్పటికీ రుణాలను తిరిగి చెల్లించకుండా, రుణదాతల రికవరీ యత్నాలకూ గండి కొట్టే ఎగవేతదారులను ‘సహకరించని రుణగ్రహీతలు’గా పరిగణించనుంది. అవసరమైన సమాచారాన్ని ఇవ్వకుండా, తనఖా పెట్టిన వాటిని విక్రయించనీయకుండా అడ్డంకులు సృష్టించే వారు కూడా ఈ కోవకు చెందుతారని పేర్కొంది.

ఒకవేళ ఏదైనా కంపెనీ ఎగవేసిన పక్షంలో సదరు సంస్థ, దాని ప్రమోటర్లు, డెరైక్టర్లు (స్వతంత్ర డెరైక్టర్లు, ప్రభుత్వ నామినేటెడ్ డెరైక్టర్లు మినహా) సహకరించని రుణగ్రహీతల జాబితాలోకి వస్తారు. కంపెనీ గాకుండా ఇతరత్రా అయితే ... ఆయా వ్యాపార నిర్వహణ బాధ్యతలు చూస్తున్న వారికి ఈ నిర్వచనం వర్తిస్తుంది. ఈ తరహా రుణగ్రహీతల గురించిన సమాచారాన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు.. ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ (సీఆర్‌ఐఎల్‌సీ)కి సమర్పించాల్సి ఉంటుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement