అడుగుజాడలో... ఎన్ని గురుతులో... | Sakshi
Sakshi News home page

అడుగుజాడలో... ఎన్ని గురుతులో...

Published Tue, Jan 8 2019 7:09 AM

YS jagan Vizianagaram Praja Sankalpa Yatra Special Story - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర వెనుక చాలా బలమైన సంకల్పం ఉంది. అందుకనే ఎన్ని అవాంతరాలు వచ్చినా, కుట్రలు, కుతంత్రాలు జరిపినా ఆయన అడుగు ముందుకేశారే తప్ప వెనకడుగు వేయలేదు. ఆయన తలపెట్టిన సంకల్పంలో తాము సైతం అంటూ జిల్లాలోని వైఎస్సార్‌సీపీ నాయకులు జగన్‌మోహన్‌రెడ్డి అడుగులో అడుగు వేస్తూ 2018, సెప్టెంబర్‌ 24 నుంచి నవంబర్‌ 25 వరకు పాదయాత్ర చేశారు. ఎస్‌. కోట నియోజకవర్గంలోని కొత్తవలస మండలం, చింతపాలెం వద్ద జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు జిల్లా నేతలు, ప్రజలు స్వాగతం పలికి కురుపాం నియోజకవర్గంలోని నాగూరు వద్ద జిల్లా దాటే వరకూ ప్రతిరోజూ ఆయన వెంట నడిచారు. మరోవైపు విజయనగరం జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర ఎన్నో మైలు రాళ్లను దాటింది.  వైఎస్సార్‌సీపీ నేతలు కూడా మీ వెంట మేమున్నామంటూ జగన్‌మోహన్‌రెడ్డి వెంట జిల్లాలో అడుగులు వేశారు. పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజ్‌ జిల్లాలో పాదయాత్ర ప్రారంభమైనప్పటినుంచి చివరి వరకు పార్టీ అధ్యక్షుడి వెంట  నడిచారు. వీరితోపాటు సమ న్వయకర్తలూ ఆయా నియోజకవర్గాల్లో పాల్గొన్నారు.

 సమర్థ నాయకుడు..
రాష్ట్రంలోని 13 జిల్లాలో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌రెడ్డి సమర్థ నాయకుడు. ఈ మహాయజ్ఞాన్ని భగ్నం చేసేందుకు  ప్రయత్నించినా.... చివరికి ప్రాణాలను తీసి అంతమొందించేందుకు కుట్రలు పన్నినా  ఐదు కోట్ల మంది ఆంధ్రుల అభిమానంతో  ద్విగ్విజయవంతంగా పూర్తి చేశారు.  2009కు ముందు  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్సార్‌ ఏ విధంగా అయితే ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టిన రాష్ట్ర ప్రజల  ఆమోదంతో ముఖ్యమంత్రి అయ్యారో... ఇదే తరహాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ముఖ్యమంత్రి  కావడం ఖాయం.             
–మజ్జి శ్రీనివాసరావు,  వైఎస్సార్‌సీపీజిల్లా రాజకీయ వ్యవహారాల  సమన్వయకర్త , విజయనగరం.

నూతన ఉత్సాహం..
 జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్రతో జిల్లాలో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. జిల్లాలో పాదయాత్ర ప్రవేశించినప్పటి నుంచి చివరి వరకు జగన్‌మోహన్‌రెడ్డితో పాదయాత్రలో పాల్గొన్నాను. ప్రజలు పెద్ద ఎత్తున యువనేతను కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారు. 2004లో దివంగత మహానేత వైఎస్సార్‌కు వచ్చిన ఆదరణ మరోసారి జగన్‌మోహన్‌రెడ్డికి వచ్చింది.   – బెల్లాన చంద్రశేఖర్,విజయనగరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు

నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నాను..
జిల్లా తొమ్మిది నియోజకవర్గాల్లో వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన  ప్రజా సంకల్పయాత్రలో నేను కూడా ఆయనతో పాటు 47 రోజులు పాల్గొన్నాను. ఈ సమయంలో ఆయన నుంచి నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నాను. ఆయనే మాకు మార్గదర్శకుడు. ఆయన ముఖ్యమంత్రి అయితేనే బడుగు, బలహీనవర్గాలకు మేలు జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారు.–  శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు

ఆయన ఓర్పే మాకు ఆదర్శం
ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో నిర్వహించిన పాదయాత్రలో నేను కూడా అన్ని నియోజకవర్గాల్లో పాల్గొన్నాను. ఆయన ఎంతో ఓర్పుగా ప్రతి ఒక్కరి సమస్యలు విన్నారు. సమస్యల పరిష్కారానికి జగనన్న ఇచ్చిన సూచనలు అమోఘం.. .– పాముల పుష్పశ్రీవాణి, ఎమ్మెల్యే, కురుపాం

ఇది మరో చరిత్ర..
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర  చరిత్రలో నిలిచిపోతుంది. ఎన్నో కష్టనష్టాలకోర్చి పాదయాత్ర చేపడుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ పాలనలో సంక్షేమ పథకాలు  ఏ విధంగా దుర్వినియోగం అవుతున్నాయో.. అభివృద్ధి చాటున అవినీతి ఎంత జరుగుతుందో గ్రహించారు. ఓ అపూర్వ ఘట్టంలో నేను కూడా భాగస్వామ్యం కావడం జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతి.–  పీడిక రాజన్నదొర, సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర

గొప్ప అనుభవం..
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రజా సంకల్పయాత్రలో పాల్గొని ఆయనతో నడవడం జీవితంలో మరిచిపోలేని గొప్ప అనుభవం. నడిచిన అనుభవం రాజకీయంగా, మానసికంగా, ఆత్మీయంగా నాలో ఎంతో మార్పు తీసుకువచ్చింది.  – అలజంగి జోగారావు, పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త

ఇతరులకు సాధ్యం కాని కీర్తి ..
రాష్ట్ర వ్యాప్తంగా 3,600 కిలోమీటర్లకు పైగా ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ పాదయాత్ర చేయడం మరే వ్యక్తికీ సాధ్యం కాదు. ప్రజాధరణలో దివంగత ముఖ్యమంత్రులు ఎన్‌టీఆర్, రాజశేఖరరెడ్డిలను మించిపోయారు. జిల్లాలోనూ ఆయన పర్యటన న భూతో న భవిష్యత్‌గా సాగింది. –శంబంగి వెంకట చిన అప్పలనాయుడు,            బొబ్బిలి సమన్వయకర్త 

జగన్‌మోహన్‌రెడ్డి యుగపురుషుడు
జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఒక బృహత్తర ఘట్టం. ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రతి ఒక్కరికీ భరోసా కల్పిస్తూ వచ్చారు. 3 వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయడం యుగపురుషునికి మాత్రమే సాధ్యం. ఎస్‌.కోట నియోజకవర్గంలో చేపట్టిన పాదయాత్రతో నియోజకవర్గ ప్రజలకు ఎంతో భరోసా లభించింది. జగన్‌మోహన్‌రెడ్డితో కలసి పాదయాత్రలో పాల్గొన్నాను.  
– కడుబండి శ్రీనివాసరావు, ఎస్‌.కోట నియోజకవర్గ సమన్వయకర్త

పాదయాత్రతో భరోసా..
జగన్‌ మోహన్‌రెడ్డి పాదయాత్రతో రాష్ట్ర ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జగన్‌మోహన్‌రెడ్డి పడుతున్న కష్టాన్ని చూసి గజపతినగరం నియోజకవర్గ ప్రజల నుంచి చక్కని స్పందన లభిస్తోంది. నియోజకవర్గంలో దారి పొడవునా అన్ని వర్గాల ప్రజలతో మమేకమవ్వడంతో.. గత నాలుగున్నరేళ్లుగా పడుతున్న కష్టాలను జననేతకు చెప్పుకునే అవకాశం దొరికింది.  
– బొత్స అప్పలనరసయ్య,గజపతినగరం నియోజకవర్గ సమన్వయకర్త

ప్రజాక్షేత్రంలోనే తేల్చుకునేందుకు..
ముఖ్యమంత్రి అక్రమాలు, అవినీతిని ప్రజలకు వివరించి ప్రజా క్షేత్రంలోనే బలమెంతో తేల్చుకునేందుకు జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఫిరాయింపులు ప్రోత్సహించి నీచ సంస్కృతికి పాల్పడిన వ్యక్తిగా చంద్రబాబు పేరుగాంచాడు. చివరకు అసెంబ్లీని కూడా టీడీపీ కార్యాలయంగా మార్చేశాడు.  జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రకు వచ్చిన స్పందన చూసి చంద్రబాబునాయుడుకు వణుకు పుట్టింది.
–  బడుకొండ అప్పలనాయుడు, నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త

ప్రజా బలంతో విజయవంతం..
 ప్రజా సంకల్పయాత్ర ప్రజాబ లంతో విజయవంతమైంది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చి నా.. చివరికి హత్యాయత్నం జరిగినా మడమతిప్పని నేత జగన్‌మోహన్‌రెడ్డి.  365 రోజులు పాటు 3600 కిలోమీటర్ల  సాగిన  సుదీర్ఘ పాదయాత్రలో అనేక లక్షల మంది ప్రజలు  కష్టాలు, బాధలు చెప్పుకున్నారు. అంతేకాకుండా  రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలను ప్రజల నోటి నుంచి  స్వయంగా తెలుసుకున్నారు.
– కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ,వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్‌

ప్రజలు కోరుకుంటున్నారు..
 జగన్‌ర మోహన్‌రెడ్డి సీఎం కావాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. ప్రజలకు సుస్థిర పాలన అందించండంలో చంద్రబాబు నాయుడు పూర్తిగా వైఫల్యం చెందారు. నా రాజకీయ జీవితంలో దివంగంత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో పాటు కుమార్తె వైఎస్‌ షర్మిలతో కూడా పాదయాత్ర చేశాను.  జగన్‌ మోహన్‌రెడ్డి పాదయాత్ర నూతన రాజకీయ శకానికి నాంది.
 – పెనుమత్స సాంబశివరాజు,వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Advertisement

తప్పక చదవండి

Advertisement