టీడీపీ ఎమ్మెల్యే స్వగ్రామంలో జననేతకు ఘన స్వాగతం | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యే స్వగ్రామంలో జననేతకు ఘన స్వాగతం

Published Tue, Nov 21 2017 5:52 AM

YS Jagan Mohan Reddy Gets Grand Welcome In Sanjamala - Sakshi

సంజామల: బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనానర్దన్‌రెడ్డి స్వగ్రామమైన యనకండ్లలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఘనస్వాగతం లభించింది. ఈ గ్రామ ంలో మహిళా సదస్సు జరగాల్సి ఉండగా ఎమ్మెల్యే సభకు అనుమతి రాకుం డా అడ్డుకున్నారు. అలాగే వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు ఎవరూ వెళ్లకుండా హుకుం జారీ చేశారు. అయితే సోమవారం బనగానపల్లె శివారు నుంచి పాదయాత్ర యనకండ్ల సమీపానికి చేరుకుంటుండగా గ్రామప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎండను సైతం లెక్కచేయకుండా రోడ్డుపై వేచి ఉన్నా రు. గంటపాటు యనకండ్ల మీదుగా సాగిన పాదయాత్రలో మహిళ లు, వృ ద్ధులు, యువకులు, అభిమానులు రాజన్న బిడ్డ జగన్‌ను చూసేందు కు ఎగబడ్డారు. అడుగడుగునా మహిళలు జగన్‌కు నీరాజనం పలికారు. స్థానిక టీడీపీ నాయకులు జగన్‌ పాదయాత్రకు ఎవరూ వెళ్లకుండా ఎన్ని ప్రయత్నా లు చేసినా మహిళలు హారతిపట్టి జననేతకు స్వాగతం పలకడం విశేషం. 

భూపట్టాలు ఇప్పించండి
కోవెలకుంట్ల: అవుకు మండలం మంగంపేట తండాకు చెందిన లంబాడీ మహిళలు గోవిందమ్మ బాయి, సాలమ్మ, కేశమ్మ, లక్ష్మి, రామక్క తదితరు లు సోమవారం వైఎస్‌జగన్‌ను బనగానపల్లె వద్ద కలసి సమస్యలు వివరిం చారు. అడవి హక్కుల చట్టం కింద భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఇంతవరకు ఆ భూములకు సంబంధించి తమకు పట్టాలు ఇవ్వలేదని ఆ సంఘం నాయకులు మద్దిలేటి నాయక్, శ్రీరామ్‌ నాయక్‌ జగన్‌ దృష్టికి తెచ్చారు. తమ తండాకు రోడ్డు, బస్సు సౌకర్యం, పక్కా ఇళ్లు లేక సమస్యలతో సతమతమవుతున్నామని విన్నవించుకున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని జగన్‌ వారికి భరోసానిచ్చారు.

డిగ్రీ చదివినా ఉద్యోగాలు రాలేదు..
కోవెలకుంట్ల: ‘మా పిల్లలు డిగ్రీ వరకు చదువుకున్నా ఉద్యోగాలు రాలేదన్నా’ అని బనగానపల్లె మండలం పసుపల గ్రామానికి చెందిన బాలనాగమ్మ వైఎస్‌ జగన్‌ ముందు ఆవేదన వ్యక్తం చేసింది. సోమవారం ప్రజాసంకల్ప యాత్రలో ఆమె జననేతను కలసి సమస్యలను విన్నవించింది. తన ముగ్గురు పిల్లలు మధు, మహాలక్ష్మి, మనోహర్‌ డిగ్రీ వరకు చదువుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల పంట నష్టం జరిగితే ప్రభుత్వం ఇప్పటివరకు పరిహారం అందించలేదన్నారు. ఇల్లు కూడా లేక కష్టాలు పడుతున్నట్లు ఆమె జగన్‌ దృష్టికి తెచ్చింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. 

ఉపాధి కల్పించండన్నా..
కోవెలకుంట్ల: ఉపాధి అవకాశాలు కల్పించి తమను ఆదుకోవాలని కోరుతూ యనకండ్ల గ్రామానికి చెందిన అబ్దుల్, రామకృష్ణ, మద్దిలేటి తదితరులు వైఎస్‌ జగన్‌ను కోరారు. సోమవారం బనగానపల్లె మండలంలో పాదయాత్రగా వస్తున్న జననేతకు వారు వినతిపత్రం అందజేశారు. మైనింగ్‌ భూముల్లో పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారమని, ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకోవడంతో పనులు లేక ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సమీపంలో ఉన్న సిమెంట్‌ ఫ్యాక్టరీలో స్థానికేతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి తమకు అన్యాయం చేశారని వాపోయారు. నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు జగన్‌ను కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement