ఆ వాహనం ఎవరిదో! | Sakshi
Sakshi News home page

ఆ వాహనం ఎవరిదో!

Published Tue, Jul 7 2015 12:55 AM

who this vehicle

 పిఠాపురం : ఎవరు వదిలి వెళ్లారో తెలియదు. గత కొన్ని రోజుల నుంచి అక్కడే ఉంటున్న ఆ వాహనాన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉపయోగించుకుంటున్నారు కొందరు ఆకతాయిలు. ఈ విషయం ఎట్టకేలకు పోలీసులకు తెలియడంతో వారు రంగంలోకి దిగారు. పిఠాపురం పట్టణాన్ని ఆనుకుని ఉన్న అగ్రహారం మెట్ట వద్ద కొంత కాలంగా ఒక టాటా మేజిక్ వాహనాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. అది అప్పటి నుంచి అక్కడే అనుమానాస్పదంగాఉంది. దానిని ఎవరు తీసుకు వెళ్లక పోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ ఎస్సై వి.కోటేశ్వరరావు సోమవారం ఆ వాహనాన్ని పరిశీలించి దానిని పోలీసుస్టేషన్‌కు తరలిస్తామని, విచారణ జరుపుతామని తెలిపారు.  
 

Advertisement
Advertisement