వర్సిటీల్లో ఎస్సీ కోటా ఖాళీలన్నీ త్వరలో భర్తీ | Sakshi
Sakshi News home page

వర్సిటీల్లో ఎస్సీ కోటా ఖాళీలన్నీ త్వరలో భర్తీ

Published Fri, Dec 19 2014 1:11 AM

వర్సిటీల్లో ఎస్సీ కోటా ఖాళీలన్నీ త్వరలో భర్తీ

  • శాసనమండలిలో మంత్రి గంటా
  • సాక్షి, హైదరాబాద్: ఏపీలోని 15 యూనివర్సిటీల్లో ఎస్సీ కోటా కింద టీచింగ్ విభాగంలో 103, నాన్ టీచింగ్ విభాగంలో 113 మొత్తం 216 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని త్వరలోనే భర్తీ చేస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం శాసన మండలిలో తెలిపారు.

    ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ.. ఆంధ్రావర్సిటీలో 24, ఏఎన్‌యూలో 18, ఎస్వీయూలో 3, ఎస్కేయూలో 16, ద్రవిడ వర్సిటీ 4, శ్రీ పద్మావతి మహిళావర్సిటీ14, నన్నయ వర్సిటీ 4, యోగి వేమన యూనివర్సిటీ 22, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్సిటీ 8, కృష్ణా వర్సిటీ 3, విక్రమ సింహపురి వర్సిటీలో 4, రాయలసీమ వర్సిటీలో 2, జేఎన్‌టీయూ(అనంతపురం)లో 39, జేఎన్‌టీయూ(కాకినాడ)లో 14, ఆర్జీయూకేటీలో 41  ఎస్సీ పోస్టులు ఖాళీలున్నట్లు తెలిపారు.
     
    గోదాముల కొరత లేదు: సునీత
    రాష్ర్టంలో ధాన్యం నిల్వకు గోదాముల కొరత లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత గురువారం శాసనమండలికి తెలిపారు.  
     

Advertisement

తప్పక చదవండి

Advertisement