వచ్చాడయ్యో సామి.. | Sakshi
Sakshi News home page

వచ్చాడయ్యో సామి..

Published Tue, Sep 4 2018 7:07 AM

People Sharing Their Problem To YS Jagan - Sakshi

సాక్షి, విశాఖపట్నం : చిన్ని కృష్ణులతో కలిసి ఉట్టికొట్టించారు. మహిళలతో కలిసి కోలాటమాడారు. పల్లెప్రజలతో కలిసి కృష్ణాష్టమి సంబరాల్లో పాల్గొన్నారు. పండగ పూట ఊరికొచ్చిన ఆత్మీయుడికి అపూర్వ స్వాగతం పలికారు. ఉరిమే ఉత్సాహంతో ఉరకలెత్తారు.  పాదయాత్ర దారుల్లో సమస్యల తోరణం పట్టారు. దారిపొడవునా వారి కష్టసుఖాలు వింటూ వారితో మమేకమవుతూ ముం దుకు సాగారు అలుపెరగని పాదయాత్రికుడు.

నాలుగున్నరేళ్ల నారా వారి నరకాసుర పాలనకు చరమగీతం పాడే లక్ష్యంతో ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 253వ రోజు దేవరాపల్లి, కె.కోటపాడు మండలాల మీదుగా సాగింది. సోమవారం ఉదయం దేవరాపల్లి మండలం కొత్తపెంట నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఏ.భీమవరం, పొడుగుపాలెం, ఏ.కోడూరు, సూర్రెడ్డి పాలెం, సింగన్నదొరపాలెం, కె.కోటపాడు మీదుగా జోగన్నపాలెం వరకు సాగింది.

పల్లెల్లో మిన్నంటిన కృష్ణాష్టమి సంబరాలు
జగనన్న రాకతో కృష్ణాష్టమి పండగ సంబరాలు పల్లెల్లో అంబరాన్నంటాయి. పాదయాత్ర ప్రారంభమైన కొత్తపెంట గ్రామంలో జగన్‌తో ఉట్టికొట్టించేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేశారు. కోలా టాలు, భజన బృందాలు, డప్పు వాయిద్యాలు, బళ్ల వేషాలతో స్వాగతం పలికారు. శ్రీకృష్ణుడు, గోపిక వేషధారణలతో చిన్నారులు జగన్‌కు స్వాగతం పలికారు. ప్రతి ఒక్కర్ని ఆప్యాయంగా ముద్దాడి కృష్ణాష్టమి శుభాకాంక్షలు చెప్పిన జననేత ఆ చిన్నారులతోనే ఉట్టికొట్టించి వారిని ఉత్సాహపర్చారు. పండగ పూట తమ ఆత్మీయబంధువు పాదయాత్రగా తమ వద్దకు రావడంతో పల్లె ప్రజలు ఆనందంతో పరవశించిపోయారు. పాదయాత్ర ముందు వివిధ గ్రామాలనుంచి వచ్చిన కళాకారులు కోలాటమాడుతూ జగన్‌కు స్వాగతం  పలుకుతూ  ముందు నడిచారు.

దారులన్నీ జనప్రవాహాలే...
కొత్తపెంట మొదలుకొని పాదయాత్ర సాగిన దారులన్నీ జనప్రవాహాలను తలపించాయి. బహిరంగ సభ జరిగిన కె.కొత్తకోట గ్రామమైతే జన సునామీని తలపించింది. మూడురోడ్ల జంక్షన్‌ జనసంద్రమైంది. çççసభ అనంతరం వేలాది జనం వెంటరాగ జోగన్న పాలెం వద్ద పాదయాత్ర సాగింది. దారిపొడవునా అందరి కష్టాలు తెలుసుకుంటూ నేనున్నానంటూ భరోసా ఇస్తూ జగన్‌ ముం దుకు సాగారు. రైతులు, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగులు, మైనార్టీలు, ఉద్యోగ సంఘాల వారు, వైద్యశాఖలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న చిరుద్యోగులు తమ కష్టాలను చెప్పుకున్నారు. జగనన్నా.. మీరు అధికారంలోకి వస్తే తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.  

కూలీలు పరుగుపరుగున..
పొలాల్లో పనిచేసేందుకు వివిధ గ్రామాలనుంచి వచ్చిన కూలీలంతా జగనన్న చూసి పరుగు పరుగున వచ్చి తమ కష్టాలను చెప్పుకున్నారు. చెరకు రైతులను  ఆదుకోవాలని గిట్టుబాటు ధర కల్పిం చాలని కోరారు. రైతులకు గిట్టు బాటు ధర లేకపోవడంతో కూలి రేట్లు కూడా పెంచడం లేదంటూ పలువురు మహిళా కూలీలు జగన్‌కు చెప్పుకున్నారు. యువతీ, యువకులు  ఇరువైపులా జగనన్నను చూసేందుకు ఎగబడ్డారు. పలువురు సెల్ఫీ లు దిగేందుకు పోటీ పడ్డారు.  పొడుగుపాలెం జంక్షన్‌లో 90  ఏళ్ల వృద్ధులు రోడ్డుపైకి వచ్చి బాబూ.. నాన్నను చూసినట్లు ఉంది. నీకష్టం వృథాగా పోదు వచ్చే ఎన్నికల్లో నువ్వు తప్పకుం డా గెలిచి తీరుతావంటూ ఆశీర్వదించారు.  

జన సునామీ మధ్య పాదయాత్ర
ఏ కోడూరు జంక్షన్‌లో భోజన విరామానికి ఆగిన జగన్‌కు  చుట్టుపక్కల గ్రామాల వారు వేలాదిగా తరలివచ్చి ఘనస్వాగతం పలికారు.ఇక్కడ మూడురోడ్లకూడలి వేలాదిగా తరలివచ్చిన జనవాహినితో కిక్కిరిసిపోయింది. ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. భోజన విరామం అనంతరం నియోజకవర్గ నలుమూలలనుంచి వచ్చిన వేలాది మంది అభిమానులతో పాదయాత్ర సూర్రెడ్డిపాలెం, సింగన్న దొర పాలెం మీదుగా కె. కోటపాడు చేరుకుంది. జగన్‌తోపాటు పాదయాత్రలో వేలాది మంది పాల్గొనడంతో యాత్ర రెండుకిలోమీటర్ల దూరం సాగింది. సాయంత్రం భారీ బహిరంగ సభ జరిగింది. మూడు రోడ్ల కూడలితోపాటు, చుట్టుపక్కల ఉన్న భవనాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, భారీ భవంతులపైకి జగన్‌ రాకకు మూడుగంటల ముందే వేలాది మంది తరలివచ్చి వేచి ఉన్నారు. జైజగన్‌ అన్న నినాదంతో కోటపాడు, మాడుగుల రోడ్డు మార్మోగింది. పెద్ద పెద్ద జెండాలు,  బళ్లవేషాలు, డప్పు వాయిద్యాలతో  పాదయాత్ర పండగ వాతావరణాన్ని సంతరించుకుంది.

జగన్‌ను కలిసిన ఏపీ బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు..
జిల్లాలలోని దేవరాపల్లి మండలం కొత్తపెంట వద్ద వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని హైదరాబాద్‌ నుంచి వచ్చిన  ఏపీ రాష్ట్ర బార్‌ అసోసియేషన్‌ సభ్యులు వి.వి.ఆర్‌.రెడ్డి, నాగిరెడ్డి,  ఎ.రామిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, మాధవిరెడ్డి తదితరులు కలిశారు.

సంకల్ప పాదయాత్రలో రాజ్యసభ సభ్యుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, శాసనసభ పక్ష ఉపనాయకుడు బూడి ముత్యాలనాయుడు, కమలాపురం ఎమ్మెల్యే రవీంధ్రనా«థ్‌రెడ్డి, మరో ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ కడప జిల్లా నాయకుడు దుగ్గాపుపల్లి మల్లిఖార్జునరెడ్డి, మాజీ మంత్రులు మత్స్యరాస బాలరాజు,  కేసీహెచ్‌.మోహనరావు, వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్, అనకాపల్లి పార్లమెంట్‌ సమన్వయకర్త వరుదు కల్యాణి , విశాఖ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, సమన్వయకర్తలు అన్నంరెడ్డి అదీప్‌రాజు, దువ్వాడ శ్రీనివాసరావు. మాజీ ఎమ్మెల్యేలు కుంభా రవిబాబు, పిరియా సాయిరాజ్, సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీకాంత్‌రాజు, సీనియర్‌ నాయకుడు కాకర్లపూడి వరహాలరాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు బొడ్డేడ ప్రసాద్, తాడి విజయభాస్కరరెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శులు రవిరెడ్డి, పక్కి దివాకర్, అనంతపురం నుంచి రాష్ట్ర కార్యదర్శి ఎల్‌.ఎం మోహనరావు, రాష్ట్ర యువజన విభాగం  అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్‌ యాదవ్, రాష్ట్ర యూత్‌ విభాగం కార్యదర్శి గుడ్ల పోలిరెడ్డి, సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు వంగపండు ఉష, అందాల విక్రమ్, వైఎస్సార్‌సీపీ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడ సింహాద్రి, జిల్లా నాయకులు చొక్కాకుల వెంకటరావు, మళ్ల బుల్లిబాబు, పోతిన హనుమంతరావు, రెడ్డి జగన్‌మోహన్, శ్రీకాంత్‌ శ్రీను, బోకం శ్రీను, బట్రాజు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్‌.రవికుమార్, గొర్లె గోవింద్, లక్కవరపు సూర్యకుమారి, రొంగలి వెంకటరావు, పైలా లక్ష్మీనారాయణమూర్తి, రొంగలి శంకరరావు, మంతెన మాధవి, బూరె బాబూరావు, పడాల అప్పలనాయుడు, పోతిన జగదీష్, జల్లి లక్ష్మిరావు, బొడ్డు నరసింహమూర్తి, గొర్రెపోటు వెంకటరావు, వంటాకు అప్పాజీ, ఆదిరెడ్డి రామునాయుడు, మాడుగుల జడ్పీటీసీ సభ్యురాలు గొల్లవిల్లి ప్రభావతి, గొల్లవిల్లి సంజీవరావు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు ఈర్ల గంగినాయుడు, మాజీ ఎంపీపీ మత్స్యరాస వెంకట గంగరాజు,  వైఎస్సార్‌ కడప జిల్లా నుంచి బి.వి.సుబ్బారెడ్డి, పోరుమామిళ్ల నుంచి విజయప్రతాప్, బి.కోడూరు నుంచి వై.యోగానందరెడ్డి, పాడేరు నుంచి సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఇసరం హనుమంతరావు,  గొరవ కొండబాబు, సులభం మత్స్యకొండ, ఐ.మత్స్యకొండబాబు, జి.సూర్యనారాయణ, ఇచ్ఛాపురం నుంచి దళాయి రజనికుమార్, మడ్డు రాజారావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement