ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షం | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షం

Published Sat, Jun 2 2018 5:01 PM

Heavy Rain Lashes Parts Of Andhra Pradesh - Sakshi

సాక్షి, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

నెల్లూరు జిల్లాలో వైఎస్సార్‌ సీపీ చేపట్టిన ‘వంచనపై గర్జన’సభలో గాలి దుమారం చెలరేగింది. దీంతో నెల్లూరులో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షం కురుస్తున్నా ప్రజలు, కార్యకర్తలు సభా ప్రాంగంణంలోనే ఉన్నారు. వర్షంలోనే సభ కొనసాగుతోంది. జిల్లాలోని కలిగిరి, సంగం, బుచ్చి, డగదర్తి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. దీంతో జన జీవనానికి అంతరాయం ఏర్పడింది.

ప్రకాశం జిల్లా చీరాలలో సైతం భారీ ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. ఉడ్ నగర్‌లో కొబ్బరి చెట్టు విరిగి పడి సైకిల్ మీద ప్రయాణిస్తున్నా సుబ్రమణ్యం అనే వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. సింగరాయకొండ, కందుకూరు, గిద్దలూరు, వేటపాలెం ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. విశాఖలోని పాడేరు, రావి కమతం, బచ్చయ్యపేట, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరుల్లోనూ భారీ వర్షం పడుతోంది.

Advertisement
Advertisement