విద్యార్థి దశలో ముఠా కక్షలు | Sakshi
Sakshi News home page

విద్యార్థి దశలో ముఠా కక్షలు

Published Wed, Jul 1 2015 10:14 AM

విద్యార్థి దశలో ముఠా కక్షలు - Sakshi

అనంతపురం క్రైం: జిల్లాలో గ్యాంగ్‌స్టర్ల సంస్కృతి పెరుగుతోంది. కొంతమంది యువకుల ముఠాలుగా ఏర్పడి ఆయా ప్రాంతాల్లో ఆధిపత్యం కోసం పరస్పరం దాడులు చేసుకోవడం పరిపాటిగా మారుతోంది. అనంతపురం నగరంలో ఇటువంటి సాంప్రదాయం పెరుగుతోంది. తాజా ఈనెల 28 రాత్రి జరిగిన హత్యను ఉదాహరణగా చెప్పవచ్చు. గతంలోనూ అంబేద్కర్‌నగర్‌లో సిద్దు ఇదే తరహాలో హత్యకు గురయ్యాడు. అంతకు ముందు రామనగర్‌లో రెండు గ్రూపులు పరస్పరం దాడులకు దిగాయి. ఇప్పటికీ ఆ గ్రూపుల మధ్య ఘర్షణ నివురుగప్పిన నిప్పులా ఉన్నట్టు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. భూ వివాదాలు, బెట్టిం గులు వంటి కార్యకలాపాల్లో భాగస్వామ్యులు అవుతున్నారు.ఈ క్రమంలోనే దాడులు జరుగుతున్నాయి. వీరి నడుమ సామాన్య ప్రజలు  నలిగిపోతున్నారు.

రాత్రి సమయంలో సమావేశాలు:
ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదివే విద్యార్థులు రాత్రి సమయంలో అనేక కూడళ్లు, టీ కేఫ్‌ల వద్ద గ్రూపులుగా ఏర్పడి మీటింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి 12 గంటలైనా ఇళ్లకు వెళ్లకుండా బహిరంగ  ప్రదేశాల్లో చర్చలు జరుపుతున్నారు. వీరిని దారిలో పెట్టాలనుకునే తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతోంది.  

మారణాయుధాల కోసం అన్వేషణ:
తమ ప్రత్యర్థులను మట్టు బెట్టేందుకు మరణాయుధాల కోసం గోవా, చె న్నై, తదితర ప్రాంతాల్లో మరణాయుధాలు కొనుగోలు చేస్తున్నారు. అదే వేటకొడవళ్లు, పదునైన కత్తులు, హైదరాబాద్‌లో కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన సంఘటనే కాకుండా మరికొన్ని సంఘటనలకు విద్యార్థులు నాంది పలికే అవకాశం కనపడుతోంది. ఇప్పటికే సమకూర్చు కున్నట్లు సమాచారం.

చోద్యం చూస్తున్న పోలీసులు:
రాత్రి సమయంలో విద్యార్థులపై నిఘా వేయాల్సిన పోలీసు మిన్నకుండిపోతున్నారు.  కొంతమంది  స్థానికులు విద్యార్థులు గుంపులు, వారి చేష్టలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా పోలీసులు విద్యార్థులను అదుపుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement
Advertisement