గోదావరి ఒడ్డున ఎన్టీఆర్ విగ్రహం వద్దు | Sakshi
Sakshi News home page

గోదావరి ఒడ్డున ఎన్టీఆర్ విగ్రహం వద్దు

Published Sat, May 30 2015 1:48 AM

don't put  NTR statue on the banks of the Godavari

అఖిలపక్ష రౌండ్‌టేబుల్ సమావేశంలో నేతలు
 
రాజమండ్రి: శ్రీకృష్ణుని రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని గోదావరి ఒడ్డున పుష్కరాల రేవులో ఏర్పాటు చేయవద్దని రాజమండ్రిలో జరిగిన అఖిలపక్ష రౌండ్‌టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. రాజమండ్రి ఆనం రోటరీ హాలులో శుక్రవారం జరిగిన సమావేశానికి హాజరైన కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు ఈ మేరకు తీర్మానం చేశారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయ డం తప్పుకాకపోరుునా ఆ విగ్రహం కృష్ణుని రూపంలో ఉండడం కొన్ని మతాలవారి మనోభావాలకు విరుద్ధమన్నారు. పుష్కరాల సమయంలో దేవతలు, గోదావరి మాత, కవుల విగ్రహాలను ప్రతిష్టిస్తే సమంజసంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోందని తప్పుపట్టారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటున్న టీడీపీ నాయకులు మహానాడులో పార్టీ తరఫున తీర్మానం చేయ డం కాదని, ప్రభుత్వం తరఫున తీర్మానం చేసి పంపితే సమంజసంగా ఉండేదన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు తదితర నేతలు పాల్గొన్నారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement