Sakshi News home page

సాఫ్ట్‌వేర్ రంగం అభివృద్ధికి మలేషియా సాయం

Published Sun, Sep 14 2014 12:33 AM

సాఫ్ట్‌వేర్ రంగం అభివృద్ధికి మలేషియా సాయం

బాపట్ల
 సాఫ్ట్‌వేర్ రంగాన్ని నవ్యాంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి చేయడానికి ఇప్పటివరకు చెన్నైలో ఉన్న సర్వర్‌ను మలేషియా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావాలని ఎమ్మెల్యే కోన రఘుపతి అభిప్రాయపడ్డారు. స్థానిక లూటస్‌ఫాంట్ రిసార్ట్స్‌లో ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐటీ రంగాన్ని ఆకర్షించేందుకు నేరుగా కొన్ని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని మలేషియా కంపెనీల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని సూర్యలంక సముద్ర తీరానికి సర్వర్‌ను తెప్పించేందుకు రూ.150 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. బాపట్ల, రేపల్లె, చీరాల ప్రాంతాల్లో 20 వేల ఎకరాల ఆటవీభూమి ఉందని, వీటిని ఉపయోగించుకుని ఐటీ, టూరిజం, పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు కోన పేర్కొన్నారు.
 వ్యవసాయ విశ్వవిద్యాలయం కోసం ..
 బాపట్లలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుచేసేందుకు కృషి జరుగుతోందని ఎమ్మెల్యే కోన తెలిపారు. విశ్వవిద్యాలయం బాపట్లలోనే ఏర్పాటు చేయాలని శాసనసభ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. రూ.100 కోట్లతో బాపట్లలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు ఎంపీ శ్రీరామ్‌మాల్యాద్రిని కలుపుకొని పనిచేస్తానని చెప్పారు. బాపట్లలో 214ఎ జాతీయ రహదారితోపాటు, రైల్వేస్టేషన్, సూర్యలంక రోడ్లు అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తామన్నారు. హాస్పటల్ అభివృద్ధికి రూ.16 లక్షలు నిధులు విడుదల చేయాలని సంబంధిత శాఖ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. ప్రభుత్వ నిధులు వచ్చేందుకు ఆలస్యమైతుందనే ఉద్దేశంతో రూ.1.50 లక్షల సొంత నగదుతో ఆవరణాన్ని, అక్కడ ఆర్‌ఎంవో క్వార్టర్లకు మర్మమతులు చేయిస్తునట్లు తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ముప్పలనేని శేషగిరిరావు, అనంతవర్మ, పి.రాధాకృష్ణరాజు, ఎంపీపీ మానం విజేత, మున్సిపల్ వైస్‌చైర్మన్ లేళ్ళ రాంబాబు ఉన్నారు.
 

Advertisement

What’s your opinion

Advertisement