-
హార్సిలీహిల్స్ ఘాట్‌రోడ్డుపై తలకిందులైన కారు
బి.కొత్తకోట: ప్రకృతి అందాలు తిలకించి, చల్లటి వాతావరణం అనుభూతితో వెనుదిరిగిన ఓ కుటుంబ ఆనందం క్షణాల్లో ఆవిరైంది. ప్రయాణిస్తున్న కారు బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో లోయలోకి పడకుండా చేసిన ప్రయత్నాల్లో కారు తలకిందులై పడింది. అందులోని ముగ్గురు సురక్షితంగా బయటపడగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా.. బి.కొత్తకోటకు 18 కిలోమీటర్ల దూరంలోని కర్ణాటకలోని గౌనిపల్లెకు చెందిన శ్రీనివాసులురెడ్డి, రజిత భార్యాభర్తలు. వేసవి సెలవులు కావడంతో విహార యాత్రకు వెళ్లేందుకు వీరి కుమార్తె, కుమారుడు ఆరవ తరగతి చదువుతున్న గగన, ఒకటవ తరగతి చదువుతున్న సుజిత్రెడ్డిలతో కలిసి బుధవారం ఉదయం కారులో మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ వచ్చారు. కొండపై ప్రకృతి అందాలను తిలకించి చల్లటి వాతావరణంలో సేదతీరారు. కొన్ని గంటల తర్వాత తిరుగు ప్రయాణం అయ్యేందుకు వెనుదిరిగారు.కొండపై నుంచి కిందకు వస్తుండగా రేణిమాను మలుపు ముందున్న మలుపు వద్దకు రాగానే డ్రైవింగ్ చేస్తున్న శ్రీనివాసులురెడ్డి కారు బ్రేక్‌లు ఫెయిల్ అయినట్టు గుర్తించారు. ఎడమవైపు లోయలు ఉండటంతో ప్రమాదం జరిగే అవకాశాలు గుర్తించి కారును కుడివైపు తిప్పారు. అప్పటికే చేతి బ్రేక్‌ను వేసి కారును నిలిపే ప్రయత్నం చేశారు. అయినా సాధ్యం కాలేదు. దీంతో కారును కుడివైపునకు మళ్లించి కొండను ఢీకొని నిలిపేలా ప్రయత్నించారు. అయితే కొండబండను ఢీకొన్న కారు ఒక్కసారిగా రోడ్డుపై తలకిందులుగా పడిపోయింది. ఇంజిన్ నుంచి పొగలు రావడంతో అగ్నికి ఆహుతి అయ్యేలా ఉందని ఆందోళనకు గురైన శ్రీనివాసులురెడ్డి కారులోంచి బయటకు వచ్చేందుకు డోర్లు తెరచుకునే పరిస్థితి లేదని గుర్తించారు.దీంతో కుడికాలితో బలంగా తన్ని అద్దాలను పగులగొట్టారు. తర్వాత భార్య, పిల్లులు కారులోంచి బయటపడ్డారు. అద్దాలను తన్నడంతో శ్రీనివాసులురెడ్డి కుడి పాదానికి తీవ్ర గాయంతో తీవ్ర రక్తస్రావమైంది. ఈ ప్రమాద ఘటనను గుర్తించి స్థానికులు బాధితులకు సహాయక చర్యలు చేపట్టారు. పాదానికి అయిన గాయానికి బ్యాండేజి కట్టి కారులో బి.కొత్తకోట సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించారు. కాగా ప్రమాద సమయంలో కారులోనే ఉన్న భార్య రజిత, పిల్లలు గగన, సుజిత్రెడ్డిలకు ఎలాంటి గాయాలు కాలేదు. అదృష్టవశాత్తు కారు ఎడమవైపు వెళ్లకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే కారు 30 అడుగులపైనుంచి కిందకు పడి ఉండేది. -
వివాహితపై అత్తింటివారి దాడి
మదనపల్లె: కాపురం చేసేందుకు అత్తారింటికి వచ్చిన భార్యపై భర్త, అత్తామామలు దాడిచేసి, విచక్షణారహితంగా కొట్టి గాయపరిచిన ఘటన బుధవారం సాయంత్రం మదనపల్లె మండలంలో జరిగింది. తట్టివారిపల్లె పంచాయతీ దేవతానగర్‌లో నివాసం ఉంటున్న రెడ్డెప్ప, రామలక్ష్మమ్మల కుమారుడు ఎం.నరసింహులు(34)కు సోమల మండలం పెద్ద ఉప్పరపల్లెకు చెందిన స్వప్న(28)తో వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. భర్తతో విభేదాల కారణంగా స్వప్న ఆరునెలలుగా పుట్టినింటిలోనే ఉంటోంది.ఈ క్రమంలో భర్త నరసింహులు, మౌనిక అనే వేరొక అమ్మాయిని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడని తెలియడంతో, కాపురం నిలబెట్టుకునే ఉద్దేశంతో తల్లి శకుంతల, అన్న మురళితో కలిసి బుధవారం భర్త నరసింహులు ఇంటికి వెళ్లింది. కోడలు స్వప్నను ఇంటిలోకి రానివ్వకుండా, గుమ్మంలోనే మామ రెడ్డెప్ప, అత్త రామలక్షుమ్మలు అడ్డుకున్నారు. ఇన్నాళ్లుకు మొగుడు గుర్తుకు వచ్చాడా... ఇంట్లోకి రానవసరం లేదంటూ బయటకు నెట్టేందుకు ప్రయతి్నంచారు. తన భర్త ఇంటిలోకి రావద్దని చెప్పడానికి మీరెవరని, స్వప్న మొండిగా లోనికి వెళ్లేందుకు ప్రయతి్నంచడంతో అత్తమామలు, కోడలిపై దాడికి పాల్పడ్డారు.కుమార్తెను అత్తామామలు విచక్షణారహితంగా కొడుతుండటంతో అడ్డుకునేందుకు వెళ్లిన తల్లి శకుంతలను సైతం వారు కాలితో తన్ని గెంటేయడంతో ఇద్దరూ కిందపడ్డారు. ఈలోపు అక్కడకు చేరుకున్న భర్త నరసింహులు చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చేందుకు నీకెంత ధైర్యమంటూ రోడ్డుమీద అందరూ చూస్తుండగానే, కాలితో తన్నుతూ, కొడుతూ వీరంగం సృష్టించాడు. భార్య, అత్తను తీవ్రంగా గాయపరిచాడు. దీంతో బాధితులు పోలీసులకు సమాచారం అందించి, చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి వెళ్లారు. తల్లి శకుంతలకు కడుపునకు శస్త్రచికిత్స జరిగిన ప్రదేశంలో బలంగా కాలితో తన్నడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తాలూకా సీఐ ఎన్.శేఖర్ తెలిపారు. -
చెక్‌పోస్టులో భారీగా మద్యం పట్టివేత
తడ (తిరుపతి జిల్లా): ఎన్నికల వేళ భారీ ఎత్తున మద్యం పట్టుబడుతోంది. తాజాగా బీవీపాళెం చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రం వద్ద బుధవారం పెద్ద ఎత్తున మద్యం పట్టుకున్నారు. ఎస్ఈబీ అధికారులు తెలిపిన వివరాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పుదుచ్చేరి నుంచి నెల్లూరు వైపు వెళుతున్న కేరళకు చెందిన మినీ లారీని తనిఖీ చేయగా మద్యం రవాణా బట్టబయలైంది. పట్టుకున్న లారీని బీవీపాళెం సరిహద్దు ఉమ్మడి తనిఖీ కేంద్రంలోని ఎస్ఈబీ కార్యాలయానికి తరలించి సరుకు లెక్కించారు. లారీలో మొత్తం 300 కేసుల (14,400 బాటిళ్లు) క్వార్టర్ బాటిళ్ల మద్యం ఉన్నట్టు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.7.42 లక్షలుగా ఉంటుందని తెలిపారు. దీంతోపాటు లారీ, కేరళకు చెందిన డ్రైవర్ మహ్మద్ ఫిరోజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ సరుకు పుదుచ్చేరిలోని బాలాజీ ఎంటర్ ప్రైజెస్, గ్లోబల్ బేవరేజెస్ పరిశ్రమ నుంచి వస్తున్న ‘ఆల్వేస్ సూపర్ స్ట్రాంగ్’ పేరుతో ఉన్న బ్రాందీ. దీనిని ఏప్రిల్ 30వ తేదీన తయారు చేసినట్టు సీల్ ఉంది. ఈ బ్రాండ్ నెల్లూరుకు చెందిన ఓ టీడీపీ మద్యం వ్యాపారిదిగా ఎస్ఈబీ సిబ్బంది గుర్తించారు. -
Doctor Family Suicide: నేను లేక.. మీరుండలేరు..!
పటమట(విజయవాడతూర్పు): తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చి ఆత్మహత్య చేసుకున్న ఆర్థోపెడిక్ సర్జన్ ధారావత్ శ్రీనివాస్(40) ఘటన విజయవాడ నగరంలో మంగళవారం సంచలనం రేకెత్తించింది. చిరకాల స్వప్నమైన ఆస్పత్రిని ప్రారంభించిన అనతికాలంలోనే దాన్ని వదులుకోవాల్సి రావడంతో మనస్తాపానికి గురైన అతను తాను అల్లారుముద్దుగా సాకుతున్న ఇద్దరు పిల్లలు, తనతో జీవితాన్ని పంచుకున్న భార్యను, తనను పెంచి పెద్ద చేసిన తల్లిని హతమార్చి, తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణం విజయవాడ గురునానక్ నగర్లో జరిగింది. శ్రీనివాస్ అన్న దుర్గాప్రసాద్ పటమట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన విజయవా డ పోలీస్ కమిషనర్ రామకృష్ణ, డీసీపీ అదిరాజ్‌సింగ్ కేసు దర్యాప్తు చేపట్టారు.పోలీసుల కథనం మేరకు.. విజయవాడ గురునానక్ నగర్‌లోని మారుతీ కో– ఆపరేటివ్ కాలనీలో ప్లాట్ నంబరు 53లోని భవనంలో నివసించే ధారావత్ శ్రీనివాస్ గుంటూరులో వైద్య విద్య అభ్యసించారు. అనంతరం విజయవాడలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రాక్టీస్ చేశారు. సొంత ఆస్పత్రి ప్రారంభించాలని కలలు కన్నారు. ఈ క్రమంలో తన సేవింగ్స్‌తోపాటు ఓ ప్రైవేటు బ్యాంక్ నుంచి లోను తీసుకుని ఇటీవల సూర్యారావుపేటలో శ్రీజ ఆర్థోపెడిక్ క్లినిక్ ప్రారంభించారు. పూర్తిస్థాయిలో యంత్రపరికరాలు ఏర్పాటు చేసేందుకు డాక్టర్ ధారవత్ శ్రీనివాస్ స్నేహితులైన నగరంలోని ఆస్పత్రుల్లో పనిచేసే ముగ్గురు వైద్యులు అప్పులు ఇచ్చారు. దీంతో అప్పులు రూ.3 కోట్లకు చేరాయి. బ్యాంకు రుణం, స్నేహితుల వద్ద చేసిన అప్పులతో ఆస్పత్రి నడుపు తున్నా అనుకున్నంత స్థాయిలో ఆదాయం రావడంలేదు. అదే సమయంలో తామిచ్చిన అప్పులు తీర్చాలని స్నేహితులు ఒత్తిడి చేశారు. అప్పు కింద ఆస్పత్రి లో 90 శాతం వాటాను వారు సొంతం చేసుకున్నారు.వారం క్రితమే దారుణానికి వ్యూహం తన ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు మరింతగా దిగజారడంతో తానే ప్రాణంగా జీవిస్తున్న తల్లి, భార్య, పిల్లలు అనాథలవుతారని డాక్టర్ శ్రీనివాస్ భావించారు. వారి ప్రాణాలు తీసి, ఆత్మహత్య చేసుకోవా లని భావించారు. ఏప్రిల్ 25వ తేదీన గురునానక్ నగర్‌లోని సూపర్ మార్కెట్‌కు వెళ్లి రెండు చాకులు కొన్నారు. మంగళవారం తెల్లవారుజామున నిద్రపోతున్న తల్లి రమణమ్మ (65), భార్య ఉషా (38), కూతురు శైలజ (11), శ్రీహాన్ (6) మెడపై కత్తితో గాట్లు పెట్టి హత్య చేశారు. ఉదయం 6.30 గంటల సమయంలో ఇంటిలో ఉన్న కొంత నగదు, నగలు, ఆస్తి తాలూక డాక్యుమెంట్లను ఓ బ్యాగులో సర్ది దానిని కారులో పెట్టారు. అనంతరం ఎదురింటి గేటుకు ఉన్న డబ్బాలో తన అన్న దుర్గాప్రసాద్‌కు రాసిన లెటరు, తన కారు తాళం చెవిని అందులో వేశారు. తిరిగి తన ఇంటికి వచ్చి వరండాలో ఉరివేసుకున్నారు.తన వాట్సాప్‌కు వాయిస్ మెసేజ్ ఆత్మహత్య చేసుకునే ముందు డాక్టర్ శ్రీనివాస్ తన వాట్సాప్ నంబరుకు వాయిస్ మెసేజ్ పెట్టుకున్నారు. తన పరిస్థితికి తానే కారణమని, తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడలేక ఆత్మహత్య చేసు కుంటున్నానని పేర్కొన్నారు. తాను లేకపోతే తన కుటుంబ సభ్యులు అనాథలు అవుతారన్న భయంతో వారిని కూడా హతమార్చుతున్నానని ఆ మెసేజ్‌లో వివరించారు. క్లూస్ టీంతో ఆధారాల సేకరణ డాక్టర్ శ్రీనివాస్ కుటుంబ సభ్యుల మరణాలపై విచారణ చేపట్టిన పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ డాగ్‌స్కా్వడ్, క్లూస్ టీంను రప్పించారు. శ్రీనివాస్ హత్యకు వినియోగించిన చాకులు, దాని బిల్లు, సూపర్ మార్కెట్ సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు డాక్టర్ శ్రీనివాసే కుటుంబ సభ్యులను హత్యచేశాడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.మోసాన్ని జీరి్ణంచుకోలేక..! ఆర్థోపెడిక్ సర్జన్‌గా విజయవంతంగా కొనసాగు తున్న శ్రీనివాస్‌కు సొంతగా ఆస్పత్రి ఏర్పాటు చేయాలన్నది కల. ఆ మేరకు సూర్యారావుపేటలో శ్రీజ ఆర్థోపెడిక్ క్లినిక్‌ను ప్రారంభించారు. దాని నిర్వహణ కోసం స్నేహితులు అప్పులు ఇచ్చారు. ఆ అప్పులు తీర్చాలని ఒత్తిడిచేసి చివరకు ఆస్పత్రిలో 90 శాతం వాటా రాయించుకున్నారు. అనంతరం ఆస్పత్రిలోనే పనిచేయాలని శ్రీనివాస్‌ను ఒత్తిడిచేశారు. దీంతో మనస్తాపం చెంది శ్రీనివాస్ తల్లి, భార్య, పిల్లలను హత మార్చి ఆత్మహత్య చేసుకున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాస్ తండ్రి జమలయ్య నాయక్ విజయవాడ తూర్పు ఏసీపీగా పనిచేశారు. అతని అన్న నల్గొండ జిల్లా జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీనివాస్ అత్తింటి వారు కూడా ఆర్థికంగా స్థితి మంతులే. శ్రీనివాస్ కుటుంబ సభ్యుల మరణానికి తీర్చలేనంత అప్పులు కారణం కాదని, తన స్నేహితులే మానసిక క్షోభకు గురిచేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. -
కదిరి టీడీపీ అభ్యర్థి కారులో రూ.2 కోట్ల నగదు
అనంతపురం: శ్రీసత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌కు చెందిన ఫార్చునర్ కారులో సుమారు రూ.2 కోట్ల నగదు పట్టుబడింది. ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు మంగళవారం అనంతపురం నుంచి కదిరికి తరలిస్తుండగా.. స్థానిక విద్యుత్ నగర్ సర్కిల్లో పోలీసులు పట్టుకున్నారు. కారు డ్రైవర్ ఆనంద్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. కారును సీజ్ చేశారు. అనంతపురం టూటౌన్ సీఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల విధుల్లో భాగంగా అనంతపురం టూటౌన్ పోలీసులు స్పెషల్ పార్టీ, మొబైల్ స్క్వాడ్ సిబ్బందితో కలిసి మంగళవారం ఉదయం అనంతపురం విద్యుత్ నగర్ సర్కిల్లో వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఏపీ 39 ఆర్క్యూ 0999 ఫార్చునర్ వాహనాన్ని తనిఖీ చేశారు. మూడు బ్యాగుల్లో నగదు పట్టుబడింది. దాన్ని లెక్కించి రూ.1,99,97,500 ఉన్నట్టు నిర్ధారించారు. పంచనామా నిర్వహించి.. ఈ ప్రక్రియనంతా వీడియో రికార్డింగ్ చేశారు. రామ్‌నగర్ నుంచి తరలిస్తూ.. కందికుంట వెంకటప్రసాద్ కారు డ్రైవర్ సోమవారం రాత్రి బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఓ వ్యక్తిని పికప్ చేసుకుని అనంతపురం రాజు రోడ్డులోని టీడీపీ నాయకుడికి చెందిన మాసినేని హోటల్లో దించినట్టు సమాచారం. రాత్రి అక్కడే బస చేసిన డ్రైవర్ మంగళవారం ఉదయం అనంతపురం రామ్‌నగర్‌లోని ఓ ఇంటి నుంచి మూడు బ్యాగుల్లో నగదు సమకూర్చుకున్నట్టు సమాచారం. అక్కడి నుంచి సప్తగిరి సర్కిల్, సూర్యానగర్ రోడ్డు మీదుగా నేరుగా కదిరికి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ.. తనిఖీలు ఉంటాయనే ఉద్దేశంతో విద్యుత్ నగర్ సర్కిల్ మీదుగా వాహనాన్ని మళ్లించారు. కానీ.. పోలీసులు విద్యుత్ నగర్ సర్కిల్లోనూ వాహన తనిఖీలు చేపట్టడంతో నగదు పట్టుబడింది. కారు కందికుంట పేరుతోనే.. ఏపీ 39 ఆర్క్యూ 0999 నంబర్ గల ఫార్చునర్ కారు కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ పేరుతోనే రిజి్రస్టేషన్ అయింది. నగదు పట్టుబడిన విషయం తెలిసిన వెంటనే వెంకటప్రసాద్ నల్లచెరువు మండలంలో ఎన్నికల ప్రచారాన్ని అర్ధంతరంగా ముగించుకుని కదిరిలోని ఇంటికి వెళ్లిపోయారు. కదిరి వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపు ఖాయమనే సంకేతాలు వస్తుండటంతో కందికుంట అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలోనే ఓటర్లకు నగదు ఎర వేయడానికి సిద్ధమయ్యారు. అనంతపురం, ఇతర ప్రాంతాల నుంచి డబ్బు తెప్పించుకుని కదిరిలో పంచేలా ప్రణాళిక రచించుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసుల తనిఖీల్లో సుమారు రూ.2 కోట్ల నగదు పట్టుబడింది. ఆదాయపు పన్ను అధికారుల విచారణ వెంకటప్రసాద్ వాహన డ్రైవర్ ఆనంద్‌కుమార్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎవరిచ్చారు? ఇందుకు సంబంధించిన పత్రాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు. రూ.10 లక్షలకు పైగా నగదు తీసుకెళ్తూ పట్టుబడితే ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అనంతపురం పోలీసులు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. డ్రైవర్ ఆనంద్‌కుమార్‌ను ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా విచారిస్తున్నారు. పెద్ద మొత్తంలో నగదును తరలించడానికి గల కారణాలు ఏమిటి? బ్లాక్ మనీ కాకపోతే అందుకు తగిన ఆధారాలు ఇవ్వాలని సూచించారు. ఈ మొత్తం ఎవరి నుంచి తీసుకున్నారు? ఎందుకు ఇంత పెద్దమొత్తంలో నగదు ఇవ్వాల్సి వచ్చింది? తదితర కోణాల్లో ఆరా తీస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్‌బరేలీలో రాహుల్‌కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్‌కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement