-
టెక్సాస్‌లో భారీ వర్షం.. ఎటుచూసినా వరద నీరే..
టెక్సాస్: అమెరికాలోకి టెక్సాస్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా టెక్సాస్‌ను వరదలు ముంచెత్తాయి. దీంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.కాగా, భారీ వర్షాల కారణంగా అతిపెద్ద నగరమైన హ్యూస్టన్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న సుమారు 600 మంది ప్రజలను సహాయ సిబ్బంది రక్షించారు. నాలుగు నెలల్లో కురువాల్సిన వానలు ఒక్కవారంలోనే పడటంతో నగరాన్ని వరదలు ముంచెత్తాయని అధికారులు వెల్లడించారు. ఇక, వర్షాల కారణంగా ఒక్క చిన్నారి మృతి చెందినట్టు సమాచారం. Houston neighborhoods in Texas were heavily flooded on Saturday following heavy rains. Local officials reported that 178 people and 122 pets (and apparently at least one armadillo, as footage shows) have been rescued so far by emergency teams pic.twitter.com/IEVDbvZARw— RT (@RT_com) May 5, 2024 వరదల కారణంగా వీధుల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక మంది ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. కొంతమంది ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. వర్షాలు మరింత ఎక్కువగా కురిసే ముప్పు ఉండటంతో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఇక, వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్తు వ్యవస్థ దెబ్బతిన్నది. వరదలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. Crews rescued more than 400 people from homes, rooftops, and roads engulfed in murky water in Houston, Texas, following days of heavy rains. pic.twitter.com/aliJjNcfp5— Breaking News (@TheNewsTrending) May 5, 2024 Torrential rains caused catastrophic floods in southeastern #Texas leading to closure of schools and several highways around #Houston4/7VC: playingsims3 & onairryan#Flood #TXwx #Louisiana #LAwx #Storm #Rain #Flooding #Flashflood #Weather #Viral #Climate pic.twitter.com/Vu1iN6j9xP— Earth42morrow (@Earth42morrow) May 5, 2024 -
240 కోట్ల కార్మికులు ఎండలకు విలవిల!
తరచూ చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులతో పాటు పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం ప్రతి సంవత్సరం సగటున 240 కోట్ల మంది కార్మికులపై పడుతోంది. దీనికి సంబంధించిన వివరాలను అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) తన నూతన నివేదికలో అందించింది. దీనిలోప్రపంచవ్యాప్తంగా కార్మికుల భద్రత, వారి ఆరోగ్యంపై వాతావరణ మార్పుల ప్రభావాలను వివరించారు.ప్రపంచంలోని 71 శాతం మంది కార్మికులు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ బారిన పడుతున్నారు. 2010లో ఇది 65.5 శాతంగా ఉండేది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేనంతగా కార్మికులపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నివేదికలోని వివరాల ప్రకారం ప్రతి సంవత్సరం 2.3 కోట్ల మంది కార్మికులు తీవ్రమైన వేడి కారణంగా పని సమయంలో అనారోగ్యానికి గురవుతున్నారు. 18,970 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు.అత్యధిక ఉష్ణోగ్రతల్లో పనిచేసే కార్మికులు కిడ్నీ సంబంధిత వ్యాధులను ఎదుర్కొంటున్నారు. ఈ జాబితాలో 2.62 కోట్ల మంది కార్మికులు ఉండవచ్చని అంచనా. ఈ నేపధ్యంలో అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ కార్మిక చట్టాలను పటిష్టం చేయాలని ప్రభుత్వాలకు పిలుపునిచ్చింది. తద్వారా కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించవచ్చని పేర్కొంది. అత్యధిక వేడి, వాయు కాలుష్యం మొదలైనవాటి నుంచి కార్మికులను రక్షించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చింది. -
దగ్గరకానున్న చైనా సరిహద్దు.. చమోలి- పితోర్‌గఢ్ రోడ్డు పనులు షురూ!
ఇకపై ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాకు ఆనుకుని ఉన్న చైనా సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ, ఐటీబీపీల కదలికలు మరింత సులభతరం కానున్నాయి. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) చమోలిలోని లాప్తాల్ నుండి పితోర్‌గఢ్ వరకు రోడ్డు పనులను ప్రారంభించింది.2028 నాటికి ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని బీఆర్ఓ లక్ష్యంగా పెట్టుకుంది. చమోలీ నుంచి పితోర్‌గఢ్ వరకు ఉన్న 500 కి.మీ. దూరం ఈ రహదారి నిర్మాణంతో 80 కి.మీకి తగ్గనుంది. నీతి లోయలోని చివరి గ్రామమైన నీతిని ఆనుకుని చైనా సరిహద్దు ప్రాంతం ప్రారంభమవుతుంది. ఇక్కడ ఆర్మీ,ఐటీబీపీకి చెందిన ఫార్వర్డ్ పోస్ట్‌లు ఉన్నాయి.ప్రస్తుతం ఈ పోస్ట్‌లు మంచుతో కప్పబడి ఉన్నాయి. ప్రతికూల భౌగోళిక పరిస్థితుల మధ్య బీఆర్ఓ కార్మికులు ఇక్కడ సుమారు 40 కిలోమీటర్ల రహదారి కోసం కొండను కట్ చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. లాప్తాల్ నుండి మిలాం వరకు రోడ్డు కటింగ్ పనులు ప్రారంభించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మూడు నెలలుగా ఈ పనులు నిలిచిపోగా, ఇప్పుడు మళ్లీ ప్రారంభమయ్యాయి.చమోలీకి ఆనుకుని ఉన్న ఈ సరిహద్దు ప్రాంతంలో చైనా రైలు మార్గాన్ని కూడా విస్తరించింది. ఈ ప్రాంతంలోకి చైనా తరచూ చొరబడేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఇక్కడ రోడ్డు విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించింది. లాప్తాల్ నుండి మిలామ్ పితోర్‌గఢ్ వరకు రహదారి నిర్మాణం చేపట్టడం ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.గత ఏడాది జూలైలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి, లాప్తాల్ నుంచి మిలామ్ వరకు 30 కిలోమీటర్ల పొడవైన సొరంగ ప్రాజెక్టును ఆమోదించాలని అభ్యర్థించారు. ఈ నిర్మాణం చేపడితే పితోర్‌ఘర్‌లోని జోహార్ లోయ చమోలీకి అనుసంధానమవుతుంది. భవిష్యత్తులో లేహ్ లడఖ్ మాదిరిగా ఇక్కడ కూడా పర్యాటక కార్యకలాపాలను ప్రారంభించే ప్రణాళిక ప్రభుత్వం వద్ద ఉంది. -
ఇజ్రాయెల్‌లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
టెల్ అవీవ్: తమ దేశంలో అల్–జజీరా మీడియా సంస్థకు చెందిన స్థానిక కార్యాలయాలన్నీ మూసివేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ చెప్పారు. అల్–జజీరా ఆఫీసులను ఎప్పటినుంచి మూసివేస్తారన్నది వెల్లడించారు. ఇది తాత్కాలిమా? శాశ్వతమా? అనేది బయటపెట్టలేదు.ఖతార్‌కు చెందిన అంతర్జాతీయ మీడియా సంస్థ అల్–జజీరా గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దాడులను మొదటినుంచీ వ్యతిరేకిస్తోంది. గాజాలో కాల్పుల విరమణ కోసం ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి చర్చలకు ఖతార్ చొరవ చూపుతోంది. ఇరువర్గాలను ఒప్పించేందుకు ప్రయతి్నస్తోంది. ఈ నేపథ్యంలో ఖతార్‌కు చెందిన మీడియా సంస్థ కార్యాలయాలను మూసివేస్తూ ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్‌పై నిషేధం
హమాస్‌పై దాడులకు తెగపడుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఖతర్‌కు చెందిన న్యూస్ నెటవర్క్ అల్ జజీరా ఛానెల్‌పై నిషేధం విధించారు. ఇజ్రాయెల్‌లో అల్ జజీరా ఛానెల్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ‘ఖతర్‌కు దేశానికి చెందిన న్యూస్ నెట్వర్క్ అల్ జజీరా ఛానెల్ ప్రసారాలను ఇజ్రాయెల్‌లో నిషేస్తున్నాం. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రేరేపించే విధంగా ఉన్న అల్ జజీరా ఛానెల్‌ను ఇజ్రాయెల్‌లో మూసివేస్తాం’ అని ప్రధాని బెంజమిన్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. అయితే ఈ నిషేధం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందన్న విషయంపై స్పస్టత లేదు.గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి హమాస్ డిమాండ్‌ను ప్రధాని బెంజమిన్ తిరస్కరించారు. హమాస్ తమకు ఎప్పుడూ ప్రమాదకరమైనదేనని అన్నారు. ఇజ్రాయెల్ లొంగిపోదని.. గాజాలో హమాస్‌ను అంతం చేసేవరకు దాడులు కొనసాగిస్తాని తేల్చిచెప్పారు. మరోవైపు.. హమాస్, ఇజ్రాయెల్ మధ్య శాంతి నెలకొల్పడం కోసం ఖతర్, ఈజిప్ట్, అమెరికా ప్రయత్నాలు చేస్తున్నా.. బెంజమిన్ ససేమిరా అంటున్నారు. ఇక.. గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటివరకు 34,683 మంది పాలస్తీనా ప్రజలు మృతి చెందారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్‌లైట్స్
కాంగ్రెస్‌కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్‌కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్‌గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్‌రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్‌కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్‌లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement