-
కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉంటే సినిమా షూటింగులో.. అది లేదంటే హైదరాబాద్‌లో ఉంటారాయన. తనను నమ్మి గెలిపించిన ప్రజలు అప్పుడప్పుడూ ఆయనకు గుర్తొస్తుంటారు. అలా యాదికొచ్చినప్పుడల్లా ఈ ప్రాంతానికి చుట్టపుచూపుగా వస్తుంటారు. స్థానికుల అవస్థలు పట్టించుకోకుండా వెంటనే వెళ్లిపోతుంటారు. అయితే, నేడు ఎన్నికలు రావడంతో నియోజకవర్గంలో వాలిపోయారు. వెంటే కుటుంబ సభ్యులను తెచ్చుకున్నారు. ప్రచారం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న వారంతా లేని ప్రేమ ఒలకబోస్తున్నారు.పదేళ్లుగా హిందూపురం నియోజకవర్గానికి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నా ఎప్పుడూ పట్టుమని పదిరోజులు కూడా స్థానికంగా ఉన్న దాఖలాలు లేవు. ఓవైపు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ‘గడప గడపకూ’ అంటూ నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తుంటే.. బాలయ్య మాత్రం నిత్యం షూటింగులతో బిజీగా ఉండేవారు. అయితే, నేడు ఎన్నికలు రావడంతో ‘పురం’పై వాలిపోయారు. బాలకృష్ణతో పాటు ఆయన భార్య వసుంధర, కూతురు బ్రాహ్మణి ఇలా మొత్తం హిందూపురం చేరారు.పీఏలదే పెత్తనం..బాలకృష్ణ లేకపోవడంతో ఆయన పీఏలే పెత్తనం చెలాయించేవారు. అధికారం మాటున యథేచ్ఛగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారు. తమ నాయకుడికే పట్టనప్పుడు తమకేం సంబంధం అన్నట్లు ప్రజలకు అంటీముట్టనట్లు వ్యవహరించేవారు. ఒక వైపు అప్పుడప్పుడు వచ్చి పోయే ఎమ్మెల్యే, మరో వైపు తమ వ్యాపకాల్లో మునిగితేలే ఆయన పీఏలు.. ఇలా ఎవరికి వారు బిజీబిజీగా ఉండే నేపథ్యంలో స్థానిక ప్రజలు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక విసిగి పోయారు.బావ బాటలో బామ్మర్ది.. తన సొంత బావ చంద్రబాబు సీఎంగా ఉన్న 2014–19 మధ్య కాలంలో కూడా హిందూపురం నియోజకవర్గంలో అభివృద్ధికి ఒక్క పునాది రాయి కూడా బాలకృష్ణ వేయలేదు. కానీ, నేడు బావ కుటిల సూత్రాలు పాటించేందుకు సిద్ధమయ్యారు. 2014లో బాబు ముఖ్యమంత్రి అయ్యాక సంతలో పశువులను కొన్నట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయగా.. ఆయనను ఆదర్శంగా తీసుకున్న బాలయ్య నేడు ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు కౌన్సిలర్లు, ఒక జెడ్పీటీసీ, ఒక ఎంపీటీసీని కొనుగోలు చేశారు. ఒక్కొక్కరికి ఒక్కోరేటు నిర్ణయించి తమ వైపు తిప్పుకున్నారు.వ్యతిరేకతను గ్రహించి ప్రలోభాలు.. గత పదేళ్లూ బాలకృష్ణ నిర్లక్ష్యపు తీరుతో విసిగిపోయిన స్థానికులు ఈ ఎన్నికల్లో మాత్రం తగిన గుణపాఠం చెప్పేందుకే సిద్ధమైనట్లు తెలిసింది. ఈ విషయాన్ని పసిగట్టిన బాలకృష్ణ ప్రలోభాలకు తెరలేపారు. అందులో భాగంగానే ఇప్పటికే వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను కొన్న ఆయన.. అంతటితో ఆగక ప్రజలకు చీరలు, డబ్బు పంచడం తదితర అనైతిక చర్యలకు పాల్పడుతున్నట్టు సమాచారం.తామెందుకు ఎమ్మెల్యేలు కాకూడదు!బాలకృష్ణ వైఖరిపై అక్కడి ప్రజలే కాదు... టీడీపీ నాయకులు కూడా విసుగెత్తినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ నందమూరి కుటుంబాన్ని ఆదరించింది చాలు.. వారిని ఇలాగే గెలిపిస్తూ వెళితే తమకు అవకాశం రాదు అన్న ఆలోచనలో పడినట్లు సమాచారం. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఓ టీడీపీ నేతతో పాటు ఆ పారీ్టకే చెందిన మరో ముఖ్యనాయకుడు కిందిస్థాయి కార్యకర్తల వద్ద ఈ విషయంపై చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వారిని ఆదరిస్తున్నాం కదా అని అలుసైపోయాం, ఒక్కసారి ఓడిస్తే వాళ్లు వేరే నియోజకవర్గం చూసుకుంటారు అంటూ మాట్లాడుకున్నట్లు ఆ సమయంలో అక్కడ ఉన్న ఓ నాయకుడు తెలిపాడు. -
నేడు సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ఇలా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు హిందూపురంలోని అంబేడ్కర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని పలమనేరులోని బస్టాండ్ సెంటర్లో జరిగే సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని నెల్లూరు సిటీలో ఉన్న గాంధీ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. -
కందికుంట అడ్డంగా దొరికినా..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: శ్రీసత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ కారులో సుమారు రూ.2 కోట్ల నగదు పట్టివేత వ్యవహారంలో పోలీసుల తీరు చర్చనీయాంశంగా మారింది. నగదు తరలింపులో కందికుంట పాత్రపై పక్కా ఆధారాలు లభ్యమైనప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు తాత్సారం చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే కేసును పక్కదోవ పట్టించి.. కందికుంటను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కందికుంట వెంకటప్రసాద్ కారులో సుమారు రూ.2 కోట్ల నగదును అనంతపురం నుంచి కదిరికి తరలిస్తుండగా.. నాలుగు రోజుల కిందట అనంతపురం విద్యుత్ నగర్ సర్కిల్లో పోలీసులు పట్టుకున్న విషయం విదితమే. అది కందికుంట డబ్బేనని కారు డ్రైవర్ వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఇదే కారుకు ఎన్నికల ప్రచారానికి అనుమతి తీసుకున్నారు. ఇన్ని ఆధారాలున్నప్పటికీ కందికుంటపై చర్యలు తీసుకోవడానికి జాప్యమెందుకన్నది అంతుచిక్కని విషయం. ఈ కేసును నీరుగార్చేందుకు కుట్ర జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో క్లిష్టమైన కేసులను ఇట్టే ఛేదించిన అనంతపురం పోలీసులు ఈ కేసు విషయంలో ఎందుకో దోబూచులాడుతున్నారు. కేసు నుంచి కందికుంటను తప్పించేందుకు ఏమైనా ప్లాన్ వేస్తున్నారా అన్న అనుమానాలు నెలకొన్నాయి. నాలుగు బైకులు పట్టుకుంటేనే హడావుడిగా ప్రెస్‌మీట్ పెట్టిమరీ వివరాలు వెల్లడించే పోలీసు అధికారులు.. సుమారు రూ.2 కోట్ల నగదు పట్టుబడిన విషయంలో మాత్రం ఎందుకు నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నారో అర్థం కావడంలేదు.రోజుకో మలుపు భారీస్థాయిలో నగదు పట్టుబడిన ఈ కేసు మలుపులు తిరుగుతోంది. దీనిపై కిందిస్థాయి పోలీసులు ముందుకెళ్లకుండా పైస్థాయి అధికారులు బంధనాలు వేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే కదిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటరి్నంగ్ అధికారి (ఆర్వో)కి సమాచారం ఇచ్చామని పోలీసులు చెప్పారు. వాస్తవానికి వారు ఆర్వోకి సమాచారం ఇవ్వనేలేదు. కందికుంట ఎవరి ద్వారానైనా పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారా? లేదా పోలీసులకే దీనిపై ‘ప్రత్యేక శ్రద్ధ’ ఉందా అన్నది తేలడం లేదు. అనంతపురం పోలీసు ఉన్నతాధికారుల వద్ద ఈ కేసు విషయంపై కిందిస్థాయి పోలీసులు చర్చించడానికి కూడా భయపడుతున్నట్టు తెలుస్తోంది. కందికుంట కారులో మూడు బ్యాగులు ఉన్నట్టు పలు టీవీ చానళ్ల విజువల్స్‌లో స్పష్టంగా కనిపిస్తుండగా, పోలీసులు మాత్రం రెండు బ్యాగులే ఉన్నట్లు చెబుతున్నారు. మూడో బ్యాగులోనూ డబ్బులు ఉన్నాయా, ఒకవేళ ఉంటే ఎక్కడికి వెళ్లాయన్నది తేలాల్సి ఉంది. గతంలో హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారిపై భారీస్థాయిలో హవాలా నగదు పట్టుబడిన కేసులో రెండురోజుల్లోనే నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. అదే ఈ కేసులో మాత్రం ‘అనంత’ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. ఆర్వోకి సమాచారం ఇవ్వకుండానే ఇచ్చామని ఒక సీఐ చెప్పడం కూడా అనుమానాలకు తావిస్తోంది.ఆర్వోకి సమాచారం ఇచ్చాం డబ్బుకు సంబంధించి విచారణ చేస్తున్నాం. ఇందులో ఉన్నది రెండు బ్యాగులే. ఒకవేళ ఉంటే మూడో బ్యాగు బట్టల బ్యాగ్ అయి ఉండొచ్చు. ఆర్వో దగ్గరకు మా అధికారులు వెళ్లారు. ఆర్వో నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయి. ఈలోగా మిగతా విచారణ జరుగుతూనే ఉంటుంది. – ఈ నెల 2వ తేదీన అనంతపురం టూటౌన్ సీఐ క్రాంతికుమార్‘సాక్షి’కి చెప్పిన వివరాలు నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు కందికుంట వెంకటప్రసాద్‌కు సంబంధించి సీజ్చేసిన రూ.2 కోట్ల కేసు వివరాలు ఇప్పటివరకు నాకు అందలేదు. నేను కదిరి ఆర్వోగా ఉన్నాను. కేసు అనంతపురంలో బుక్ చేశారు. అయినా నేను పోలీసులను అడిగాను. కానీ ఇప్పటివరకు వివరాలు ఇవ్వలేదు. పోలీసులు ఇచ్చే వివరాలను బట్టి మాత్రమే చర్యలు తీసుకోగలం. – ఈ నెల 3వ తేదీన కదిరి రిటరి్నంగ్ అధికారి సన్నీ వంశీకృష్ణ వెల్లడి -
జయరాం.. రాం!
గుంతకల్లులోని 18వ వార్డులో బుధవారం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎదుటే టీడీపీలోని తలారి మస్తానప్ప వర్గం, మధు, శివల వర్గం మాటల యుద్ధానికి దిగారు. గుమ్మనూరు నచ్చజెప్పినా వినలేదు. దీంతో విసిగిపోయిన జయరాం.. ‘‘మీకు చేతులు జోడించి మొక్కి చెబుతున్నా.. పార్టీని భ్రష్టు పట్టించకండి..’’ అని నిట్టూరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదొక్కటే కాదు.. ఇప్పటివరకూ గుమ్మనూరు ప్రచారం నిర్వహించిన ప్రతి చోటా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకుని, ఏదేదో అనుకుని గుంతకల్లు బరిలో దిగితే ఇంకేదో జరుగుతుండడంతో ‘గుమ్మనూరు’ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గుంతకల్లు: ‘అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే... జేబులు ఖాళీ ఆయెనే’’ అదేదో సినిమాలోని ఈ పాట టీడీపీ గుంతకల్లు అభ్యర్థి గుమ్మనూరు జయరామ్‌కు సరిగ్గా సరిపోతోంది. డబ్బుతో ఎన్నికలు గట్టెక్కవచ్చు అనుకున్న ఆయన అంచనాలు తలకిందులవుతున్నాయి. తెలుగు తమ్ముళ్ల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు జయరామ్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అసలే ఆరాచకవాదిగా ముద్ర పడిన జయరామ్ పట్ల ఇప్పటికే గుంతకల్లు ప్రజల్లో సదభిప్రాయం లేదు. ఈ క్రమంలోనే సొంత పార్టీ కేడర్ కూడా కలిసి రాకపోవడంతో ఆయన ఏటికి ఎదురీదుతున్నారు.పుండుపై కారం.. 👉 గుంతకల్లు నియోజకవర్గంలో చాలా చోట్ల టీడీపీ నాయకుల మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్నా ఇప్పటి వరకూ బయటపడలేదు. అయితే, ప్రచారం నిమిత్తం గుమ్మనూరు ఆయా ప్రాంతాల్లో పర్యటించిన సమయాల్లో తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శిస్తూ రచ్చకెక్కుతున్నారు. 👉 టీడీపీ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ భర్త, ప్రస్తుతం గుంతకల్లు పదో వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ ఐదేళ్లుగా పారీ్టకి దూరంగా ఉన్నాడు.👉 దీంతో ఆ వార్డు బాధ్యతలను రాయల్ వెంకటే‹Ùకు పార్టీ అధిష్టానం అప్పగించింది. ఇటీవల వెంకటేష్ ఆహా్వనం మేరకు గుమ్మనూరు జయరాం 10వ వార్డుకు రాగా, దీన్ని జీరి్ణంచుకోలేని చంద్రశేఖర్.. గుమ్మనూరు ఎదుటే వెంకటేష్‌తో గొడవకు దిగారు. ఈ క్రమంలోనే చంద్రశేఖర్ వర్గానికి చెందిన పలువురు వెంకటే‹Ùపై దాడికి దిగారు. తమ కులానికి చెందిన వ్యక్తిపై దాడి జరగడంతో బలిజ సంఘం నాయకులు ఓర్చుకోలేకపోతున్నారు. చంద్రశేఖర్‌తో బేషరుతుగా క్షమాపణలు చెప్పించాలంటూ ఇప్పటికే గుమ్మనూరు సోదరుల వద్దకు పంచాయితీకి వెళ్లినా ఏ మాత్రం స్పందన లేకపోవడంతో గుమ్మనూరు తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. 👉 10 రోజుల కిత్రం జితేంద్రగౌడ్ ఆధ్వర్యంలో ఏబీ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన అత్మీయ సమావేశానికి గుమ్మనూరు జయరాం హాజరయ్యారు. ఈ సమావేశంలో తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని కొందరు బహిరంగంగా విమర్శించారు. మాజీ కౌన్సిలర్లు ఆమ్లేట్ మస్తాన్‌యాదవ్, కేశప్ప మధ్య వాగ్వాదం చేటు చేసుకొని, బూతులు తిట్టుకున్నారు. 👉 కథలగేరిలోని మాజీ కౌన్సిలర్ ఆమ్లేట్ మస్తాన్‌యాదవ్, మరో మాజీ కౌన్సిలర్ కథల మారెప్ప, కుమారుడు మహేష్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం గుమ్మనూరు నిర్వహించిన ప్రచారంలో తారస్థాయికి చేరాయి. మస్తాన్యాదవ్ను వార్డులో తిరగనీయనంటూ గుమ్మనూరు ఎదుటే మహేష్ హెచ్చరికలు జారీ చేశాడు. జనసేన, బీజేపీ నాయకులూ గరంగరం..👉కూటమిలో భాగస్వామ్య పారీ్టలైన జనసేన, బీజేపీల నుంచి కూడా గుమ్మనూరుకు వ్యతిరేకతే ఎదురవుతోంది. ఇటీవల జనసేన నాయకుడు పూలరమణ తన నివాసంలో ఆతీ్మయ సమావేశం ఏర్పాటు చేయగా, జయరాంతోపాటు టీడీపీ డాక్టర్స్ సెల్ జిల్లా అధ్యక్షురాలు పత్తి హిమబిందు హాజరయ్యారు. ఈ సందర్భంగా హిమబిందు మాట్లాడుతూ జన సైనికులు ఆవేశం తగ్గించుకుని మాట్లాడాలని అనడంతో ఒక్కసారిగా ఆ పార్టీ కార్యకర్తలు భగ్గుమన్నారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే ఊరుకునేది లేదని గుమ్మనూరు ఎదుటే హిమబిందును హెచ్చరించారు.👉 బీజేపీలో నాయకుల మధ్య వర్గ పోరు కూడా గుమ్మనూరుకు మైనస్‌లా మారింది. బీజేపీ నాయకులు మంజుల వెంకటే‹Ù, కొలిమి రామాంజనేయులు మధ్య చాలా కాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇలా.. గుంతకల్లు నియోజకవర్గంలోని ప్రతి వార్డులో, గ్రామాల్లో వ్యతిరేకతకు తోడు బీజేపీ, జనసేనల నుంచి కూడా చిక్కుముళ్లు ఎదురవుతుడడంతో గుమ్మనూరు జయరామ్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు తెలుస్తోంది. -
అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
అనంతపురం, సాక్షి: జిల్లాలో భారీగా డబ్బుతో కంటెయినర్లు వెళ్తుండడం ఒక్కసారిగా కలకలం రేపింది. హైదరాబాద్ - బెంగళూరు హైవేపై నాలుగు కంటెయినర్లలో వెళ్తున్న భారీ డబ్బును పోలీసులు గుర్తించారు. అయితే ఆ నగదు సస్పెన్స్ కాసేపటికే వీడింది.పామిడి మండలం గజరాంపల్లి దగ్గర హైవేపై నాలుగు కంటెయినర్లను పోలీసులు తనిఖీల్లో భాగంగా అడ్డుకున్నారు. ఆ కంటెయినర్లలో ఒక్కోదాంట్లో రూ.500 కోట్ల చొప్పున రూ.2 వేల కోట్ల దాకా నగదు కనిపించింది. ఎన్నికల కోడ్ అమల దృష్ట్యా కలెక్టర్, సంబంధిత అధికారులతో పాటు ఐటీ అధికారులకు పోలీసులు సమాచారం అందించారు.చివరకు పత్రాల పరిశీలన తర్వాత కొచ్చి(కేరళ) నుంచి హైదరాబాద్‌కు ఆ కంటెయినర్లు వెళ్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ ఆర్బీఐ బ్రాంచ్‌లో ఆ నగదును డిపాజిట్ చేసేందుకు ఆ కంటెయినర్లు అధికారికంగానే వెళ్తున్నాయని, క్షుణ్ణంగా పరిశీలించాక ఆ కంటెయినర్లను ముందుకు వెళ్లేందుకు అనుమతించినట్లు పామిడి సీఐ రాజశేఖర్‌రెడ్డి మీడియాకు వివరించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement