కుమార్తెను వేధించాడంటూ ఎస్‌ఐని చితకబాదిన మహిళలు

యువతిని వేధించాడంటూ ఓ ప్రభుత్వ అధికారిని ఇద్దరు మహిళలు చితకబాదారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. వివరాలు.. మహేశ్వర్‌ జిల్లాలో అక్రమ మద్యం వ్యాపారం జరుగుతుందనే సమాచారంతో ఎక్సైజ్‌ ఎస్‌ఐమోహన్‌లాల్‌ భయాల్‌ తన సిబ్బందితో కలిసి రైడ్‌ చేయడానికి వచ్చాడు. ఈ క్రమంలో ఓ ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో ఆ ఇంటి వారికి, అధికారులకు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఓ మహిళ మోహన్‌ భయాల్‌ తన కుమార్తెను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ.. అతనిపై దాడి చేసింది. అతడు తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో మోహన్‌ భయాల్‌ చొక్కా పట్టుకుని రోడ్డు మీదకు లాక్కొచ్చి మరి చితకబాదింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Taboola - Feed

Back to Top