ఈ యువతి సాహసం ఎవ్వరివల్లా కాదు | Sakshi
Sakshi News home page

ఈ యువతి సాహసం ఎవ్వరివల్లా కాదు

Published Thu, May 25 2017 7:26 PM

అమెరికాలో ఓ మగువ దొంగలకు షాకిచ్చింది. తన కారును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న దొంగలకు ఓ లేడీ జేమ్స్‌బాండ్‌ రేంజ్‌లో చుక్కలు చూపించింది. దొంగ తన కారును ఎత్తుకెళుతుండగా నేరుగా కారు బానెట్‌పైకి దూకేసి కారును కనీసం ఓ పది మీటర్లు కూడా కదలనివ్వకుండా చేసింది. చివరకు ఆ దొంగ బెంబేలెత్తిపోయి పారిపోయాడు.