16 వేల పోస్టులకు పాతర! | Sakshi
Sakshi News home page

16 వేల పోస్టులకు పాతర!

Published Mon, Jan 4 2016 7:03 AM

జాబు కావాలంటే బాబు రావాలి.. అన్నారు... కానీ బాబొచ్చాక కొత్త జాబులు రావడం కాదు ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి. కొత్తగా పోస్టుల భర్తీపై ఆయన ఏకంగా నిషేధాజ్ఞలు విధించారు. అందుకే కొత్తగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఏవీ ఉండడం లేదు. అంతేనా.. కొత్త నోటిఫికేషన్లే కాదు.. ఎప్పుడో ఇచ్చిన నోటిఫికేషన్లను కూడా చంద్రబాబు నాయుడు మూలకు చేర్చేశారు. వాటిపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఎలాంటి చర్యలూ తీసుకోకుండా చంద్రబాబు మోకాలడ్డుతున్నారు. దానివల్ల 16,154 పోస్టుల భర్తీ అటకెక్కేసింది. ఆ పోస్టులపై ఆశలు పెట్టుకున్న లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లారు...