No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Thu, Apr 18 2024 10:45 AM

తమిళ్‌ వేందన్‌ 
 - Sakshi

సాక్షి, చైన్నె : కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో పోటీ చేస్తున్న అన్నాడీఎంకే అభ్యర్థి తమిళ్‌ వేందన్‌ తాను ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు బుధవారం ప్రకటించారు. ఈ ప్రకటన అన్నాడీఎంకే వర్గాలను షాక్‌ గురిచేసింది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి నమశ్శివాయం, కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ సీఎం వైద్యలింగం, అన్నాడీఎంకే అభ్యర్థితమిళ్‌ వేందన్‌ పోటీచేస్తున్నారు. వీరితోపాటు నామ్‌ తమిళర్‌ కట్చి, బీఎస్పీ తదితర అభ్యర్థులు ఉన్నారు. అయితే ప్రధాన సమరం బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ఇక్కడ నెలకొని ఉంది. ఒంటరిగా అన్నాడీఎంకే ఓట్ల వేటలో పరుగులు తీసినా, చివరి క్షణంలో అభ్యర్థి చేసిన ఎన్నికల బహిష్కరణ ప్రకటన తీవ్ర చర్చకు దారి తీసింది. బుధవారం మీడియాతో తమిళ్‌ వేందన్‌ మాట్లాడుతూ, ఈ లోక్‌సభ ఎన్నికలను తాను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ ఓటుకు నోట్లను కుమ్మరిస్తోందని, అయినా ఎన్నికల అఽధికారులు చోద్యంచూస్తున్నారని ఆరోపించారు. ఆధారాలతో సహాయ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడం శోచనీయమన్నారు. అందుకే ఎన్నికలను తాను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement