No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Thu, Apr 18 2024 10:45 AM

- - Sakshi

సాక్షి, చైన్నె: హామీలు.. ఆరోపణలు, విమర్శలు.. వాగ్వాదాలతో సాగిన ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రం తెరపడింది. దీంతో సుమారు నెల పాటు సాగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారం సమాప్తమైంది. చివరిరోజైన బుధవారం అన్నిపార్టీల నేతలు, అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు సాగించాయి. నేతల ఉపన్యాసలతో హోరెత్తిన మైకులు, లౌడ్‌స్పీకర్లు సాయంత్రం 6 గంటల తరువాత ఒక్కసారిగా మూగబోయాయి. వివరాలు.. తమిళనాడు లోక్‌ సభ ఎన్నికల సంగ్రామంలో డీఎంకే ఇండియా కూటమి, అన్నాడీఎంకే నేతృత్వంలో మినీ కూటమి, బీజేపీ నేతృత్వంలో ఎన్‌డీఏ కూటమి, ఒంటరిగా నామ్‌ తమిళర్‌ కట్చి సర్వశక్తులూ ఒడ్డి ప్రచారం సాగించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ అగ్రనేతలు తమిళనాడుపై ఈ సారి ప్రత్యేక దృష్టి పెట్టి తరలివచ్చారు. ఎన్‌డీఏ అభ్యర్థుల గెలుపు కోసం ప్రధాని నరేంద్రమోదీ తొమ్మిది సార్లు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌ నాథ్‌ సింగ్‌ తదితరులు పలుమార్లు తీవ్రస్థాయిలో ప్రచారం నిర్వహించారు. ఇండియా కూటమిని బలపరుస్తూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండు సార్లు పర్యటించారు. ఈ కూటమిలో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌, యువజన విభాగం నేత, మంత్రి ఉదయ నిధి స్టాలిన్‌, డీఎంకే డీప్యూటీ ప్రధాన కార్యదర్శి కనిమొళి కరుణానిధి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజక వర్గాలలో పర్యటించి ఓటర్లను ఆకర్షించారు. ఈ కూటమిలోని వివిధ పార్టీల నేతలు, వామపక్షాల జాతీయ నేతలు తమకుబలం ఉన్న చోట్ల ప్రచారం నిర్వహించారు. అన్నాడీఎంకే కూటమి తరపున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, డీఎండీకే కోశాధికారి ప్రేమలత విజయకాంత్‌ రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి ప్రచారం చేశారు. ఇతర పా ర్టీల నేతలు తమ పరిధిలో ప్రచారం నిర్వహించారు. ఇక ప్రచార పర్వం ముగియడంతో ఎన్నికల అధికారులు పోలింగ్‌ సామగ్రిని సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. నగదు బట్వాడా కాకుండా తనిఖీలను ముమ్మరం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement