Sakshi News home page

టెక్కలి ఉప విద్యా శాఖాధికారిగా పి.విలియం

Published Wed, Apr 17 2024 1:20 AM

- - Sakshi

టెక్కలి: టెక్కలి ఉప విద్యా శాఖాధికారిగా పి.విలియం మంగళవారం బాధ్యతలు చేపట్టారు. టెక్కలి మండలం పోలవరం జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ ఎఫ్‌ఏసీ ప్రాతిపదికన ఉప విద్యా శాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు మండల విద్యా శాఖాధికారులు డి.తులసీరెడ్డి, డి.చిన్నారావుతో పాటు మరి కొంత మంది ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.

నీలమణి తల్లికి పుష్పాభిషేకం

సారవకోట: మండలంలోని అవలింగి శ్రీ నీలమణి అమ్మవారికి మంగళవారం 10,116 గులాబీలతో పుష్పాభిషేకం నిర్వహించారు. ఈ ఆలయంలో సోమవారం నుంచి జరుగుతున్న వసంత త్రిరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి గులాబీలతో పుష్పాభిషేకం నిర్వహించినట్లు అర్చకులు చల్లపల్లి భాస్కరరావు ఆచారి తెలిపారు. బుధవారంతో ఈ ఉత్సవాలు ముగించనున్నట్లు వారు తెలిపారు.

స్విమ్మింగ్‌లో శిక్షణకు జమ్ము విద్యార్థి ఎంపిక

నరసన్నపేట: మండలంలోని జమ్ముకు చెందిన టెంక ప్రేమ్‌కుమార్‌కు యానాంలో రెసిడెన్షియ ల్‌ స్విమ్మింగ్‌ శిక్షణకు ఎంపికయ్యాడు. స్పోర్ట్స్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో యా నాంలో డాక్టర్‌ వైఎస్సార్‌ ఇంటర్నేషనల్‌ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న క్యాంపునకు 21న హాజరు కావాలని సమాచారం వచ్చింది. దీంతో విద్యార్థితో పాటు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నరసన్నపేటలో 9వ తరగతి చదువుతున్న ప్రేమకుమార్‌కు ఈ అవకాశం రావడం ఆనందంగా ఉందని వైఎంసీ కా ర్యదర్శి గొద్దు చిట్టిబాబు అన్నారు. మంగళవారం ప్రేమకుమార్‌ను చిట్టిబాబు సత్కరించి అభినందించారు.

మృతుడి కుటుంబానికి

ఆర్థిక సాయం

సంతబొమ్మాళి: మండలంలోని కాపుగోదాయవలస గ్రామానికి చెందిన బి.జనార్దన్‌ మరణించడంతో ఆ కుటుంబానికి హెల్పింగ్‌ హాండ్స్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్థిక సాయం అందజేశారు. హెల్పింగ్‌ హ్యాండ్‌ సభ్యులు ఉపాధి హామీ కూలీలు, విదేశాల్లో ఉన్నవారు, గ్రామా ల నుంచి నగదును సేకరించి రూ.1,35,500 మొత్తాన్ని మృతుడి భార్య కస్తూరికి అందజేశారు.

మేడపై నుంచి పడి చిన్నారి మృతి

టెక్కలి రూరల్‌: మండలంలోని బన్నువాడ గ్రామానికి చెందిన రుంకాన శశిభూషణరావు అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి పంజాబ్‌లో ఉంటున్నాడు. వారి ఒక్కగానొక్క కుమారుడు సుశాంత్‌(8) సోమవారం ఇంటి మేడపై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు జారి పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ బాలుడిని వెంటనే ఆస్ప త్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యు లు తెలిపారు. బాలుడి మృతి వార్తతో బన్నువాడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నెలరోజులు క్రితమే ఆ కుటుంబం స్వగ్రామానికి వచ్చింది. నెల గడవక ముందే ఇలా జరగడంతో గ్రామస్తులు కంటతడి పెట్టారు.

Advertisement
Advertisement