Sakshi News home page

విజయసాయిరెడ్డిని కలిసిన ప్రముఖులు

Published Wed, Nov 15 2023 12:28 AM

విజయసాయిరెడ్డికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి  - Sakshi

నెల్లూరు(సెంట్రల్‌): నెల్లూరుకు విచ్చేసిన రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ విజయసాయిరెడ్డికి రాజ్యసభ సభ్యుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మంగళవారం స్వాగతం పలికారు. అలాగే విజయసాయిరెడ్డితో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, విజయ డెయిరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌యాదవ్‌, మాలెం సుధీర్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement