బూస్టర్‌ మోటార్‌ ఏర్పాటు | Sakshi
Sakshi News home page

బూస్టర్‌ మోటార్‌ ఏర్పాటు

Published Tue, Apr 16 2024 6:45 AM

గండిపల్లిలో ఏర్పాటు చేసిన బూస్టర్‌ మోటార్‌   - Sakshi

● తండాలకు నీటి సరఫరా ● భగీరథ డీఈ బాలరాజ్‌

అక్కన్నపేట(హుస్నాబాద్‌): మండలంలోని గండిపల్లి గ్రామంలో మిషన్‌ భగీరథ అధికారులు బూస్టర్‌ మోటార్‌ను ఏర్పాటు చేశారు. ఈ గ్రామపరిధిలో ఐదారు గిరిజన తండాలు ఉన్నాయి. దీంతో మిషన్‌ భగీరథ నీళ్లు బోరింగ్‌తండా, సరిరాంతండాలకు సరఫరా చేయడం ఇబ్బందిగా మారింది. దీంతో ఈ తండాలకు భగీరథ నీళ్లు ట్యాంకులకు ఎక్కేలా బూస్టర్‌ మోటర్‌ను ఏర్పాటు చేసినట్లు భగీరథ డీఈ బాలరాజ్‌ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి తండాతండాలకు భగీరథ నీళ్లు సరఫరా చేస్తున్నామన్నారు. నీళ్లను ఎవరూ వృథా చేయొద్దని సూచించారు.

Advertisement
 
Advertisement