తీరని శోకం మిగిల్చారు... | Sakshi
Sakshi News home page

తీరని శోకం మిగిల్చారు...

Published Tue, May 21 2024 10:55 AM

తీరని

వేర్వేరు ప్రాంతాల్లో నలుగురి ఆత్మహత్య

ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో ఇద్దరు వృద్ధులు, మరో ఇరువురు యువకులు ఉన్నారు. కాగా, రాయపోలు, నిజాంపేట, మనోహరాబాద్‌ల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.

రాయపోలు(దుబ్బాక): కడుపునొప్పి భరించలేక జీవితంపై విరక్తి చెందిన వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రాయపోలులో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై రఘుపతి తెలిపిన వివరాల మేరకు.. మండలకేంద్రానికి చెందిన తుడుం నర్సయ్య (60) కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. పలు ఆస్పత్రుల్లో చికిత్సలు తీసుకున్నా తగ్గలేదు. ఆదివారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి అతను భోజనం చేశాడు. సోమవారం ఉదయం నిద్ర లేచేసరికి కన్పించకపోవడంతో కుటుంసభ్యులు వెతికారు. కాగా, తన పొలం వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితంపై విరక్తి చెంది ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని చెబుతున్నారు. మృతుడి కొడుకు అశోక్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

కల్హేర్‌(నారాయణఖేడ్‌): కుటుంబ కలహాలు, అనారోగ్యం కారణంగా పెట్రోల్‌ పోసుకుని యువకు డు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నిజాంపేట మండలంలో జరిగింది. ఎస్‌ఐ వెంకటేశం కథనం ప్రకారం.. నాగధర్‌ గ్రామానికి చెందిన పన్నెల అశోక్‌(25) ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంటలను ఆర్పిన కుటుంబసభ్యులు.. తీవ్రగాయాలైన అతడిని వెంటనే చికిత్స నిమిత్తం నారాయణఖేడ్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడి నుంచి వైద్యులు సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్‌కు రిఫర్‌ చేశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని వెల్‌నెస్‌ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ అశోక్‌ చనిపోయాడు. అతడికి భార్య దుర్గ, కుమారుడు ప్రణీత్‌ ఉన్నారు. మృతుడి తల్లి వీరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వెంకటేశం తెలిపారు.

మనోహరాబాద్‌(తూప్రాన్‌): నిత్యం మద్యం తాగితే ఆరోగ్యం పాడవుతుందని, కుటుంబసభ్యులు మందలించారు. క్షణికావేశంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మనోహరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లింగారెడ్డిపేటకు చెందిన అబ్బదాసరి పోషయ్య(55) ఈ నెల 18న మద్యం తాగి ఇంటికి రావడంతో కుటుంబసభ్యులు మందలించారు. దీంతో క్షణికావేనికి లోనైన అతడు మరుసటిరోజు ఉదయం ఇంట్లో ఉన్న గడ్డి మందును తాగాడు. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలపడంతో వారు హుటాహుటిన తూప్రాన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. ఇంకా పరిస్థితి విషమంగానే ఉండటంతో హైదరాబాద్‌లో ఉన్న గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య రేఖ, కుమారుడు స్వామి, కూతురు ఉన్నారు.

మనస్తాపం చెందిన వ్యక్తి ...

అనారోగ్యంతో సతమతమవుతున్న యువకుడు తన కుటుంబానికి భారం కావద్దని భావించి, ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పాలాటలో జరిగింది. ఎస్‌ఐ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి నాగరాజు(28) కొన్ని రోజులుగా అనారోగ్యం బారిన పడ్డాడు. చికిత్స కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈక్రమంలో కుటుంబానికి ఆర్థికంగా భారమవుతున్నానని మనస్తాపం చెందుతున్నాడు. కాగా, ఆదివారం రాత్రి ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

క్షణికావేశంలో..

తీరని శోకం మిగిల్చారు...
1/3

తీరని శోకం మిగిల్చారు...

తీరని శోకం మిగిల్చారు...
2/3

తీరని శోకం మిగిల్చారు...

తీరని శోకం మిగిల్చారు...
3/3

తీరని శోకం మిగిల్చారు...

Advertisement
 
Advertisement
 
Advertisement