Sakshi News home page

‘బండి’ పోరాటంతోనే స్పందించిన ప్రభుత్వం

Published Sat, Apr 20 2024 1:25 AM

-

● బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీరుద్రమ

సిరిసిల్ల: నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై ఎంపీ బండి సంజయ్‌ చేపట్టిన పోరాట ఫలితంగానే రూ.50కోట్లు విడుదలయ్యాయని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీరుద్రమ పేర్కొన్నారు. శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఆడెపు రవీందర్‌లతో కలిపి శుక్రవారం ప్రకటన విడుదలు చేశారు. నేతన్నల దీనావస్థపై బండి చేపట్టిన పోరాటంతోనే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చిందని పేర్కొన్నారు. మిగిలిన రూ.301 కోట్లు కూడా వెంటనే విడుదలు చేయాలని డిమాండ్‌ చేశారు.

పని ప్రాంతంలో వసతి కల్పించాలి

తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఉపాధిహామీ పనులు జరిగే ప్రాంతాల్లో వసతి కల్పించాలని డీఆర్డీవో శేషాద్రి సూచించారు. తంగళ్లపల్లి మండలంలోని ఉపాధిహామీ సిబ్బందితో మండల పరిషత్‌లో శుక్రవారం సమావేశమయ్యారు. డీఆర్డీవో శేషాద్రి మాట్లాడుతూ 2024–25 సంవత్సరానికి జాబ్‌కార్డు గల ప్రతీ కుటుంబానికి పని కల్పించాలని సూచించారు. 8,815 జాబ్‌కార్డులకు 8,81,500 పని దినాలు కల్పించాలన్నారు. జిల్లాలో మండలాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు కృషి చేయాలని కోరారు. ఏపీడీ నర్సింహులు, ఎంపీడీవో(ఎఫ్‌ఏసీ) జోగం రాజు, ఇన్‌చార్జి ఏపీవో రాజనర్సయ్య పాల్గొన్నారు.

Advertisement
Advertisement