సమస్యల పరిష్కారమే లక్ష్యం | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారమే లక్ష్యం

Published Wed, Nov 22 2023 12:12 AM

వినతి పత్రం అందిస్తున్న నాయకులు - Sakshi

జ్యోతినగర్‌(రామగుండం): ఎన్టీపీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యమని ఎన్టీపీసీ యునైటెడ్‌ ఎంప్లాయస్‌ యూనియన్‌(సీఐటీయూ) అధ్యక్షుడు ఎన్‌.భిక్షపతి అన్నారు. ఎన్టీపీసీలో ఈదునూరు భూమయ్య అధ్యక్షతన మంగళవారం జరిగిన జనరల్‌ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 26న గుజరాత్‌లోని వడోదరలో నిర్వహించే ఎన్టీపీసీ ఎన్బీసీ సమావేశంలో సమస్యలపై చర్చిస్తామన్నారు. డబ్ల్యూ–0, డబ్ల్యూ–1గ్రేడ్‌ ఉద్యోగులకు మెడికల్‌, పదవీ విరమణ తర్వాత మెడికల్‌ సౌకర్యం పొందేందుకు 15ఏళ్ల సర్వీస్‌ నిబంధన తొలగింపు, 13ఏళ్లుగా పదోన్నతులు పొందని డబ్ల్యూ–1 గ్రేడ్‌ ఉద్యోగులకు డబ్ల్యూ–2 గ్రేడ్‌ పదోన్నతికి ఉన్న ఎనిమిదో తరగతి విద్యార్హత నుంచి మినహాయింపు, కేరీర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (సీడీపీ) ప్రవేశపెట్టి కిందిస్థాయి ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే పథకం పునరుద్ధరణ తదితర అంశాలపై ఏజీఎం(హెచ్‌ఆర్‌) బిజయ్‌కుమార్‌ సిగ్దర్‌కు వినతిపత్రం అందించామని అన్నారు.

నూతన కార్యవర్గం

సమావేశం అనంతరం యూనియన్‌ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. యూనియన్‌ గౌరవ అధ్యక్షుడిగా ఎర్రవెల్లి ముత్యంరావు, అధ్యక్షుడిగా ఎన్‌.భిక్షపతి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా భూమయ్య, ప్రధాన కార్యదర్శిగా రాజేశ్వర్‌, ఉపాధ్యక్షులుగా సాంబయ్య, రాసపల్లి సంపత్‌, సారయ్య, కార్యదర్శులుగా ఎం.కుమార్‌, శంకర్‌, రామాచారి, కోశాధికారిగా భిక్షపతి, సభ్యులుగా గణేశ్‌, వీరయ్యను ఎన్నుకున్నారు.

ఎన్టీపీసీ యునైటెడ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నేత భిక్షపతి

Advertisement
Advertisement