Sakshi News home page

కనులపండువగా పుష్పార్చన

Published Mon, Apr 15 2024 2:05 AM

- - Sakshi

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం దుర్గగుడిలో అమ్మవారికి కాగడా మల్లెలు, జాజులతో అర్చన చేశారు. తొలుత ఆలయ ఈఓ కె.ఎస్‌.రామరావు దంపతులు, ఏఈఓ ఎన్‌. రమేష్‌బాబు, స్థానాచార్య శివప్రసాద్‌ శర్మ, వైదిక కమిటీ సభ్యులు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, మురళి అమ్మవారికి అర్చన చేయించే పుష్పాలతో అంతరాలయంలోని మూలవిరాట్‌ను దర్శించుకున్నారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా పుష్పార్చన వేదిక వద్దకు చేరుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణ చేస్తుండగా, అర్చకులు పుష్పాలతో అమ్మవారికి అర్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పంచహారతుల సేవ జరిగింది. అర్చన చేసిన పుష్పాలను భక్తులకు పంపిణీ చేశారు. భక్తులతో లక్ష్మీ గణపతి ప్రాంగణం సందడిగా మారింది. పుష్పార్చనను వీక్షించేందుకు విచ్చేసిన భక్తులకు ఈవో రామరావు సౌభాగ్య ఆధ్యాత్మిక పుస్తకాలను పంపిణీ చేశారు.

Advertisement
Advertisement