అరవిరిసిన కాంతులు | Sakshi
Sakshi News home page

అరవిరిసిన కాంతులు

Published Tue, Nov 14 2023 1:04 AM

- - Sakshi

ఆకాశం అరవిరిసిన కాంతులతో ప్రజ్వరిల్లింది. వెలుగు దివ్వెల వైభవంతో తేజరిల్లింది. కొత్త ఆశలతో కోటి దీపాలు మిలామిలా మెరుస్తుండగా.. దీపావళి ధూంధాంగా సాగింది. పటాకుల చప్పుళ్లు.. పిల్లాపాపల కేరింతలతో వేడుక ఆనందాలను పంచింది. చిన్న పెద్ద, ముసలి, ముతకా తేడా లేకుండా అంతా ఒక్కచోట చేరి చేసిన సంబరం అంబరాన్నంటింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి నిర్వహించిన దీపావళి కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. గుంటూరు నగరంలో బాణసంచా కాలుస్తున్న కుటుంబాన్ని చిత్రంలో చూడొచ్చు. – పాతగుంటూరు/విజయవాడ

అరవిరిసిన కాంతులు

Advertisement
Advertisement