సంక్షేమ పథకాలపై మహిళలకు శిక్షణ | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథకాలపై మహిళలకు శిక్షణ

Published Sat, May 25 2024 3:10 PM

సంక్షేమ పథకాలపై మహిళలకు శిక్షణ

జయపురం: జయపురం చైల్డ్‌ ఫండ్‌ విభాగం ద్వారా లీడ్‌ మదర్‌ మహిళలకు స్థానిక పంచాయతీ సమితి కార్యాలయ సభాగృహంలో శిక్షణ శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. తల్లీబిడ్డల సంరక్షణ, ఆరోగ్య పరిరక్షణ, వివిధ ప్రభుత్వ పథకాలు అమలు చేయటంపై అవగాహన కల్పించారు. పంచాయతీల పరిధిలో పని చేస్తున్న సిబ్బంది మహిళలకు మంచిజరిగేలా పని చేయాలని అధికారులు వివరించారు. గొడొపొదర్‌, టంకువ, రొండాపల్లి, బరిణిపుట్‌ గ్రామ పంచాయతీల నుంచి 20 మంది లీడ్‌ మా మహిళలు శిక్షణలో పాల్గొన్నారు. శిశువులు, కిశోరీల ఆరోగ్యం, ప్రభుత్వ చేపట్టిన పథకాలపై శిక్షణ ఇచ్చామని నిర్వాహకులు తెలిపారు. రామణగుడ కమ్యూనిటీ వైద్య కేంద్రాధికారి డాక్టర్‌ సుధాకర బిశాయి లీడ్‌ మదర్‌ మహిళలకు శిక్షణ ఇచ్చారు. చెల్డ్‌ ఫండ్‌ విభాగ కోఆర్డినేటర్‌ పూర్ణిమా దాస్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అభినాశ్‌ సిన్హ, ప్రమీళ నాయక్‌, సీతామణి హంతాల్‌, మధుశ్మిత నాయక్‌, గౌరీ చరణ్‌ హంతాల్‌ పాల్గొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా లీడ్‌ మా మహిళలకు తమ విధులపై మరింత అవగాహన ఏర్పడుతుందని కోఆర్డినేటర్‌ పూర్ణిమ దాస్‌ అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement