వస్తువులు స్వాధీనం | Sakshi
Sakshi News home page

వస్తువులు స్వాధీనం

Published Fri, Apr 19 2024 1:35 AM

సమావేశంలో మాట్లాడుతున్న సీఈవో నికుంజ బిహారి ధొలొ  - Sakshi

శుక్రవారం శ్రీ 19 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2024
రాష్ట్రంలో రూ.118.65 కోట్ల

సీఈవో నికుంజ బిహారి ధొలొ

భువనేశ్వర్‌: ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.118.65 కోట్ల విలువైన వివిధ వస్తువులను సీజ్‌ చేసినట్లు సీఈవో నికుంజ బిహారి ధొలొ గురువారం తెలియజేశారు. వీటిలో రూ. 2.7 కోట్ల నగదు, రూ.18.19 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు, రూ.43.69 కోట్ల విలువైన గంజాయి, బ్రౌన్‌ షుగర్‌, రూ.7.17 కోట్ల విలువైన బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు. కలహండి, నవరంగ్‌పూర్‌, కొరాపుట్‌, బరంపురం పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో 28 అసెంబ్లీ స్థానాలకు మే 13న ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నాలుగు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. ఆ రోజు మొత్తం 6,284,649 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఽతెలిపారు. ప్రధాన ఎన్నికల అధికారి ఈ నాలుగు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణ కోసం 3 మంది పరిశీలకులను నియమించారు. వీరు అభ్యర్థుల ఖర్చులపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారని ఽసీఈవో తెలిపారు. తొలి విడతలో పోలింగ్‌ జరగనున్న 4 పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి రాష్ట్ర ఎన్నికల కార్యాలయానికి సీ–విజిల్‌ యాప్‌ ద్వారా 587 ఫిర్యాదులు అందాయి. వాటిలో 582 ఫిర్యాదులను పరిష్కరించారు. ప్రధానంగా పోస్టర్లు, బ్యానర్లకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయన్నారు.

తొలిదశ నోటిఫికేషన్‌ జారీ

రాష్ట్రంలో తొలి దశ ఎన్నికలకు సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం విడుదల చేసింది. మే 13న ఆయా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతుంది. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో తొలి దశలో నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలు కలహండి, నవరంగ్‌పూర్‌, కొరాపుట్‌, బరంపురం మరియు 28 అసెంబ్లీ స్థానాల్లో ఓటింగ్‌ జరుగుతుంది. ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఏప్రిల్‌ 25 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఏప్రిల్‌ 26న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్‌ 29 అని పేర్కొన్నారు. రాష్ట్రంలో మే 20, మే 25, జూన్‌ 1 తేదీల్లో వరుసగా రెండు, మూడు, నాలుగో దశల్లో పోలింగ్‌ జరగనుంది. తుది ఫలితాలను జూన్‌ 4న ప్రకటిస్తారు.

న్యూస్‌రీల్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement