Sakshi News home page

కబ్జాల టీచర్‌పై చర్యలేవి?

Published Wed, Apr 17 2024 1:15 AM

- - Sakshi

నిజామాబాద్‌అర్బన్‌: ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుంటూ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాలిన ఉపా ధ్యాయుడు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నాడు. కొందరు సంఘం నాయకులను కలుపుకొని ఓ ప్రజాప్రతినిధితో కలిసి గతకొన్నేళ్లుగా జిల్లా కేంద్రంతోపాటు ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తున్నాడు. నందిపేట మండలంలో విధు లు నిర్వర్తిస్తున్న ఆ ఉపాధ్యాయుడిపై ఇటీవల కొందరు డీఈవో, పాఠశాల విద్యాశాఖ (హైదరాబాద్‌)కు ఫిర్యాదు చేశారు.

నగరంలోని వినాయక్‌నగర్‌ యాదగిరిబాగ్‌లో ప్రభుత్వ స్థలాన్ని ఓ ముఖ్య ప్రజాప్రతినిధితో కలిసి కబ్జా చేశాడు. ఇక్కడ కొందరు నిరుపేదలు గుడిసె లు వేసుకొని ఉండగా, వారిని బెదిరించి ఖాళీ చే యించాడు. గుడిసెలు వేసుకున్న వారు ఉపాధ్యా యుడితో వాగ్వాదానికి దిగగా, వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతోవారు అతడిపై నాల్గోటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. వినాయకనగర్‌లోని మరోచోట ఫూలాంగ్‌ వాగు పక్కన స్థలాన్ని కబ్జా చేసి ఇతరుల పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించారు. పాఠశాల రిజిస్టర్‌లో సంతకం చేసి ప్రతిరోజూ వ్యక్తిగత పనిమీద బయటికి వెళ్తున్నాడని తెలిసింది. యాదగిరిబాగ్‌లో పేదలకు వాగ్వాదానికి దిగిన రోజున సదరు ఉపాధ్యాయుడు సాధారణ సెలవు పెట్టి మరీ వచ్చారు. దీంతో సద రు ఉపాధ్యాయుడి లీవ్‌లెటర్‌తోపాటు యాదగిరిబాగ్‌లోని కబ్జాస్థలంలో ఉన్న ఫొటోలను, ఎఫ్‌ఐఆర్‌కాపీని జతచేసి విద్యాశాఖకు ఫిర్యాదు చేశారు. ఇదే ఉపాధ్యాయుడు నవీపేట మండలంలో రెండు చోట్ల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ఇతరుల పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు ఆరోపణలున్నాయి. నాగారంలో కొన్ని చోట్ల పట్టాలిప్పిస్తామని పలువురు మహిళల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి మోసగించినట్లు ఫిర్యాదులున్నాయి. గతంలో ఆయ నపై అందిన ఫిర్యాదులపై విచారణ చేపట్టిన ఎంఈ వో అసంపూర్తి నివేదిక ఇవ్వగా, మళ్లీ విచారణ చేపట్టాలని మరో అధికారిని డీఈవో నియమించారు.

కేసులు.. ఫిర్యాదులు

ఇన్ని ఫిర్యాదులున్నా ఉపాధ్యాయుడిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 5న కలెక్టర్‌కు బోర్గం(పి) గ్రామానికి చెందిన రవి ఫిర్యాదు చేశారు. నాలుగో పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మార్చి 16న కేసు నమోదైంది. సీపీతోపాటు డీఈవో, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారికి కూడా బాధితులు ఫిర్యాదు చేశారు. విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి అండతో సదరు టీచర్‌ తప్పించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.

నాలుగు చోట్ల ప్రభుత్వ భూములు కబ్జా

చర్యలు తీసుకుంటాం

కబ్జాల వ్యవహారంలో టీచర్‌పై ఫిర్యాదులు అందా యి. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. ఇది వర కే విచారణ ప్రారంభమైంది. – దుర్గాప్రసాద్‌, డీఈవో

Advertisement

తప్పక చదవండి

Advertisement