Sakshi News home page

తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు

Published Tue, Apr 16 2024 12:00 AM

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌
 - Sakshi

● కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

నిర్మల్‌చైన్‌గేట్‌: పట్టణాలు, గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో తాగు, సాగు నీటి అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు తాగునిటి ఇబ్బందులు రాన్వికుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున వచ్చే 2 నెలలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాగునీటి సరఫరా ప్రక్రియలో అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఫిర్యాదులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలన్నారు. నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపాలిటీల్లో ప్రతీ ఇంటికి మిషన్‌ భగీరథ నీరు సరఫరా అయ్యేలా చూడాలని ఆదేశించారు. పైప్‌లైన్‌, చేతిపంపులకు మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు చనిపోకుండా నిరందించాలన్నారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. నిరంతరం పారిశుధ్య పనులు చేపట్టాలని పేర్కొన్నారు. నీటి వృథాను అరిట్టేలా సాగునీటి కాలువలకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో నీటి పారుదలశాఖ ఎస్‌ఈ సుశీల్‌కుమార్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్‌, మిషన్‌ భగీరథ డీఈ సందీప్‌, నిర్మల్‌, ఖానాపూర్‌, భైంసా మున్సిపల్‌ కమిషనర్లు రాజు, మనోహర్‌, వెంకటేశ్వర్‌రావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కోతుల బెడద తీర్చాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కోతుల బెడద తీర్చాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కోతుల దాడుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించే అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మల్‌, ఖానాపూర్‌, భైంసా మున్సిపాలిటీల్లో కోతులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నందున వాటి నియంత్రణకు మున్సిపల్‌, అటవీ, వైద్యశాఖ అధికారులు సమన్వయంతో పనియాలని ఆదేశించారు. కోతులను పట్టుకునే బృందాలను ఏర్పాటు చేసి, వాటిని పునరావాస కేంద్రాలకు తరలించి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించాలని సూచించారు. తర్వాత వాటిని జనావాసాలకు దూరంగా రిజర్వు ఫారెస్ట్‌లో వదిలిపెట్టాలన్నారు. కోతుల పట్టివేతకు సంబంధించిన డేటాను కచ్ఛితంగా నమోదు చేయాలని తెలిపారు. కోతుల దాడికి గురై ఆసుపత్రులకు వచ్చే బాధితులకు వ్యాక్సిన్లు వేసి, మెరుగైన చికిత్స అందించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఫైజాన్‌అహ్మద్‌, డీఎఫ్‌వో రామ్‌కిషన్‌, డీఎంహెచ్‌ఓ ధనరాజ్‌, నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపల్‌ కమిషనర్లు రాజు, వెంకటేశ్వర్‌రావు, మనోహర్‌, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement