వడ్డీ డబ్బులివ్వట్లే! | Sakshi
Sakshi News home page

వడ్డీ డబ్బులివ్వట్లే!

Published Thu, May 23 2024 6:15 AM

వడ్డీ డబ్బులివ్వట్లే!

గురువారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2024

నల్లగొండ టూటౌన్‌: జిల్లాలోని మున్సిపాలిటీల్లో గల స్వయం సహాయక పొదుపు సంఘాలకు కొన్నేళ్ల నుంచి ప్రభుత్వాలు వడ్డీ డబ్బులు చెల్లించడం లేదు. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, చిట్యాల, నందికొండ, చండూరు, నకిరేకల్‌, హాలియా మున్సిపాలిటీల్లో పొదుపు సంఘాలకు 2019–20 సంవత్సరం నుంచి వడ్డీ రావాల్సి ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరానిది కూడా కలుపుకుంటే ఐదేళ్ల వడ్డీ రూ.6.82 కోట్ల బకాయి పేరుకుపోయింది. వడ్డీ డబ్బులు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఆర్థిక సంవత్సరం ఇటీవలే ముగిసినా కనీసం మూడేళ్ల వడ్డీ డబ్బులను కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయలేదు. వడ్డీలేని రుణం (వీఎల్‌ఆర్‌) ఇస్తున్నామని చెబుతున్నారే తప్ప బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీని తిరిగి ఇవ్వడంలో ప్రభుత్వాలు తీవ్ర జాప్యం చేస్తున్నాయి. దీంతో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో 6,575 పొదుపు సంఘాల మహిళలకు ఎదురుచూపులు తప్పడంలేదు.

కొత్త సంఘాల ఏర్పాటుపై వడ్డీ ఎఫెక్ట్‌..

ప్రతి సంవత్సరం మెప్మా ఆధ్వర్యంలోని సిబ్బంది కొత్తగా మహిళా సంఘాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక్కో సంఘం ఏర్పాటు చేయాలంటే 10 మంది మహిళలు ఉండాలి. ఒక్కో మహిళ రూ.100 చొప్పున బ్యాంకులో పొదుపు చేసిన తరువాత ఆరు నెలలకు రుణం ఇస్తారు. కానీ గత నాలుగేళ్లుగా పొదుపు సంఘాలకు ప్రభుత్వాలు వడ్డీ విడుదల చేయకపోవడంతో కొత్త సంఘాల ఏర్పాటుపై ప్రభావం చూపుతోంది. కొత్తగా సంఘాలు ఏర్పాటు చేసుకునే వాళ్లు ప్రతినెలా 10వ తేదీలోగా చెల్లించకుంటే అధిక వడ్డీ పడుతుందనే భయంతో ముందుకు రావట్లేదని తెలుస్తోంది.

న్యూస్‌రీల్‌

‘ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌’కు పటిష్ట బందోబస్తు : ఎస్పీ

నల్లగొండ క్రైం: ఈ నెల 24 నుంచి జూన్‌ 3 వరకు జరగనున్న ఇంటర్‌ సప్లిమెంటరీ అడ్వా న్స్‌డ్‌ పరీక్షలకు కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్టు జిల్లా ఎస్పీ చందనా దీప్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6నుంచి సాయంత్రం 6గంటల వరకు 144 సెక్షన్‌ అమలు చేస్తామన్నారు.

నంబర్‌ ప్లేట్లులేని వాహనాలు నడపొద్దు

నంబర్‌ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ చందనా దీప్తి బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. నల్లగొండలో బుధవారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి 25 వాహనదారులపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.

ఎడ్‌సెట్‌కు నాలుగు కేంద్రాలు

నల్లగొండ రూరల్‌: తెలంగాణ ఎడ్‌ సెట్‌–2024 నిర్వహణకు ఉమ్మడి జిల్లాలో 4పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎడ్‌సెట్‌ చైర్మన్‌ గోపాల్‌రెడ్డి తెలిపారు. కోదాడలో మూడు, నల్లగొండలో ఒక కేంద్రంలో 1,100 మంది అభ్యర్థులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు రాయనున్నట్టు పేర్కొన్నారు.

రాకేష్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి

ఫ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి

ఫ పొదుపు సంఘాలకు అందని వడ్డీ నిధి

ఫ ఐదేళ్ల నుంచి చెల్లించని ప్రభుత్వాలు

ఫ ఎనిమిది మున్సిపాలిటీల్లో రూ.6.82 కోట్ల బకాయి

ఫ ఎదురు చూపుల్లో 6,575 సంఘాల మహిళలు

Advertisement
 
Advertisement
 
Advertisement