పట్టభద్రుల సమస్యలు పరిష్కరిస్తా : అభ్యర్థి రాకేష్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

పట్టభద్రుల సమస్యలు పరిష్కరిస్తా : అభ్యర్థి రాకేష్‌రెడ్డి

Published Mon, May 20 2024 7:05 AM

-

ఈనెల 27న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల .రాకేష్‌రెడ్డి కోరారు. తనను గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. అనంతరం పార్టీ నేతలు కేటీఆర్‌ను సన్మానించారు. అంతకు ముందు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాల్లో డీసీసీబి చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్‌, మాజీ ఎంపీ బడుగుల లింగం యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌, రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ జడల అమరేందర్‌, కొల్పుల అమరేందర్‌, మదర్‌ డెయిరీ మాజీ చైర్మన్‌ శ్రీకర్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఆంజనేయులు, నాయకులుదర్శులు ఏవీ కిరణ్‌కుమార్‌, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, జనగాం పాండు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్లు, పీఏసీఎస్‌ చైర్మన్లు, మండల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, పార్టీ ప్రజాప్రతినిదులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement