కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను మోసం చేస్తోంది | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను మోసం చేస్తోంది

Published Sat, May 25 2024 2:10 PM

కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను మోసం చేస్తోంది

గోవిందరావుపేట: అధికార కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను మోసం చేస్తూ కాలం వెళ్లదీస్తుందని ఎమ్మెల్సీ ఎన్నికల ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, అసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ములుగు జెడ్పీ చైర్‌పర్సన్‌ బడే నాగజ్యోతి ఆధ్వర్యంలో జరిగిన ప్రచారంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడింది. బీఆర్‌ఎస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రతీఒక్కరు పని చేయాలని, ఆయన గెలుపు చారిత్రక అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సూడి శ్రీనివాస్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు లకావత్‌ నరసింహనాయక్‌, పోరిక గోవింద్‌ నాయక్‌, బొల్లం శివ, ఫక్రుద్దీన్‌, దేవ నాయక్‌, హనుమంత రావు, వాగా నాయక్‌, మోహన్‌ రాథోడ్‌, సూరినేని రవీందర్‌, మల్లేష గౌడ్‌, అజయ్‌, గురునాథ్‌, గాంధీ, ఇంద్ర రెడ్డి, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

పాలనను గాలికి వదిలేసిన ప్రభుత్వం

ఏటూరునాగారం: ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసిందిదని జెడ్పీ చైర్‌ పర్సన్‌ బడే నాగజ్యోతి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల సన్నాహక సమావేశం బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గడదాస్‌ సునీల్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌, జిల్లా అధ్యక్షుడు కాకుల మర్రి లక్ష్మణబాబు, నాయకులు, తదితరులు ఉన్నారు.

అసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి

Advertisement
 
Advertisement
 
Advertisement