Alia Bhatt In Maldives With Her Friends, Alia Bhatt Maldives Photos - Sakshi
Sakshi News home page

బీచ్‌లో అలియా అందాల ఆరబోత

Published Mon, Feb 8 2021 11:44 AM

Alia Bhatt Enjoy In Maldives With Her Gang - Sakshi

నాన్‌స్టాప్‌ షూటింగులతో ఆ మధ్య అలిసి సొలిసి ఆస్పత్రిపాలైంది అలియా భట్‌. ప్రథమ చికిత్స అనంతరం కోలుకున్న ఆమె తిరిగి షూటింగ్‌లతో బిజీ అయింది. కానీ ఈ సారి వీటికి చిన్న బ్రేక్‌ చెప్తూ.. తన గ్యాంగ్‌ను వెంటేసుకుని విహారానికెళ్లింది. సోదరి షాహీన్‌ భట్‌, స్నేహితులు ఆకాంక్ష రంజన్‌ కపూర్‌, అనుష్క రంజన్‌లతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తోంది. వీళ్లంతా బికినీ దుస్తుల్లో బీచ్‌ అందాలను ఆస్వాదిస్తున్నారు.

ఈ క్రమంలో అక్కడ కాలక్షేపం చేస్తున్న ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. తాజాగా ఆకాంక్ష తన గ్యాంగ్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ.. "నాకు నీ మీద ఎంత ప్రేముందో ఈ ప్రపంచానికంతటికీ తెలుసు" అని రాసుకొచ్చింది. అలియా కూడా ఆదివారం నాడు తీరంలో సేద తీరుతున్న ఫొటోలను నెట్టింట అప్‌లోడ్‌ చేసింది. మొత్తానికి సముద్ర తీరంలో అందాలు ఆరబోస్తున్న వీరి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ హడావుడి చేస్తున్నాయి.

కాగా ఆకాంక్ష రంజన్‌ కపూర్‌ విషయానికొస్తే.. గతేడాది ఆమె నెట్‌ఫ్లిక్స్‌ 'గిల్టీ' సినిమాలో నటించింది. రుచి నరైన్‌ దర్శకత్వం వహించిని ఈ చిత్రంలో కియారా అద్వానీ, గుర్ఫతే సింగ్‌ పిర్జాదా, తాహెర్‌ షాబీర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక అలియాభట్‌ టాలీవుడ్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్‌', బాలీవుడ్‌లో 'గంగూభాయి కతియావాడి'లో నటిస్తోంది. రణ్‌బీర్‌ కపూర్‌, అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి ఫాంటసీ చిత్రం 'బ్రహ్మాస్త్ర'లో కనిపించనుంది. బాలీవుడ్‌లో గంగూభాయి కతియావాడితో పాటు, ఇటు టాలీవుడ్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌లో నటిస్తోంది.

చదవండి: హమ్మయ్యా... అలియా డిశ్చార్జ్‌!

పోర్న్‌ వీడియో రాకెట్‌: నటి అరెస్ట్‌

Advertisement
Advertisement