Sakshi News home page

మొదటి దశ ర్యాండమైజేషన్‌ పూర్తి

Published Wed, Mar 27 2024 12:05 AM

ర్యాండమైజేషన్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌  - Sakshi

● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ బి.సంతోష్‌

మంచిర్యాలఅగ్రికల్చర్‌: లోక్‌సభ ఎన్నికల్లో భా గంగా జిల్లాలోని ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ మొదటి దశ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ బి.సంతోష్‌ అన్నారు. మంగళవారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో ఎన్నికల దృష్ట్యా పోలింగ్‌ సి బ్బంది ర్యాండమైజేషన్‌ ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌తో కలిసి పరిశీలించా రు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాట్లాడు తూ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చెన్నూర్‌, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల్లో పో లింగ్‌ సిబ్బంది మొదటి దశ ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు. ఇందులో 1,131 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 1,111 మంది సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు, 2,187 మంది ఇతర ప్రిసైడింగ్‌ అధికారులు మొత్తం 4,429 మంది సిబ్బంది ర్యాండమైజేష న్‌ పూర్తి చేసినట్లు చెప్పారు. ఉద్యోగులు వారికి కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఉద్యోగులకు కేటాయించిన విధుల్లో సవరణ కోసం జిల్లా ఎన్నికల అ ధికారికి దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఈ–డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ సునీల్‌, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement