Sakshi News home page

గంజాయి పట్టివేత

Published Wed, Mar 27 2024 12:00 AM

నగదును ఎస్‌ఎస్‌టీ సిబ్బందికి ఇస్తున్న ఎస్సై  - Sakshi

మందమర్రిరూరల్‌: మందమర్రి పోలీస్‌స్టేషన్‌ పరిధి లోని రైల్వేస్టేషన్‌ రోడ్డు సమీపంలోని భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన డేగల వివేక్‌రాజ్‌ వద్ద 500 గ్రాముల గంజాయి పట్టుకున్నామని మందమర్రి ఎస్సై రా జశేఖర్‌ తెలిపారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో తక్కువ ధరకు కొనుగోలు చేసి మందమర్రిలో ఎ క్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడని పే ర్కొన్నారు. నమ్మదగిన వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నామని తెలిపారు. ఈ మేరకు వివేక్‌రాజ్‌పై కేసు నమోదు చేస్తున్నట్లు పే ర్కొన్నారు. ఇతడిపై గతంలోనూ బెల్లంపల్లి పరిధి లో గంజాయి కేసు నమోదైనట్లు తెలిపారు.

రూ.1.05లక్షల నగదు సీజ్‌

కాసిపేట: కాసిపేట పోలీస్‌స్టేషన్‌ పరిధి చొప్పరిపల్లి సమీపంలో పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఏర్పా టు చేసిన చెక్‌పోస్టు వద్ద మంగళవారం వాహనాల తనిఖీ చేపట్టి రూ.1.05లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై ప్రవీణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేసి గోలేటికి చెందిన అప్పం మహేశ్‌ వద్ద రూ.54,700 పట్టుకున్నట్లు తెలిపారు. మాచర్ల రాకేశ్‌ వద్ద రూ.51 వేలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పట్టుబడిన మొత్తాన్ని ఎస్‌ఎస్‌టీ–2 సిబ్బందికి అప్పగించినట్లు తెలిపారు.

అటవీ బీట్‌ ఆఫీసర్లకు అవగాహన

మంచిర్యాలక్రైం: ఫారెస్ట్‌ అకాడమీకి చెందిన 34వ బ్యాచ్‌ ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్లకు వైల్డ్‌ లైఫ్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ 1972, తెలంగాణ ఫారెస్ట్‌ యాక్ట్‌ 1967పై స్థానిక జన్మభూమినగర్‌లోని కెమిస్ట్‌ భవన్‌లో మంగళవారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్‌ పర్సన్‌గా హైదరాబాద్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ సొసైటీ, సెంటర్‌ ఫర్‌ వైల్డ్‌ లైఫ్‌ స్టడీస్‌ ప్రాజెక్ట్‌ కో ఆర్డినేటర్‌, న్యాయవాది రామిండ్ల తిరుపతి వ్యవహరించారు. అటవీ సంరక్షణ, తెలంగాణ ఫారెస్ట్‌ యాక్ట్‌, వైల్డ్‌ లైఫ్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌పై వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది నటేశ్వర్‌, మంచిర్యాల ఎఫ్‌ఆర్‌ఓ రత్నాకర్‌రావ్‌, 46మంది ట్రైనీ బీట్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement