వనపర్తిలో గద్దకు వైద్యం | Sakshi
Sakshi News home page

వనపర్తిలో గద్దకు వైద్యం

Published Sat, May 25 2024 12:35 PM

వనపర్తిలో గద్దకు వైద్యం

వనపర్తి: హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలకు తగిలి షాక్‌కు గురైన గద్దకు వైద్యం చేసి ప్రాణాలు కాపాడారు. వివరాలిలా.. వనపర్తి జిల్లా ఖాశీంనగర్‌ శివారులో రైతు వెంకటస్వామి తన వ్యవసాయ పొలంలో హైటెన్షన్‌ వైర్ల కింద ఎగరలేక పడి ఉన్న గద్దను చూసి స్నేక్స్‌ సొసైటీకి సమాచారం ఇచ్చారు. దీంతో కృష్ణసాగర్‌ అక్కడికి చేరుకుని గద్దకు కుడిరెక్క ఎముక విరిగినట్లు గుర్తించి జిల్లాకేంద్రంలోని పశువైద్యశాలకు తీసుకువచ్చి చికిత్స చేశారు. గద్ద వయస్సు 35– 40 ఏళ్లు ఉంటుందని వైద్యశాఖ సిబ్బంది గోళ్లు, ముక్కు పొడవు చూసి అంచనా వేశారు. కుడిరెక్క ఎముక విరగడంతో ఎగరలేక కిందపడిపోయి ఉంటుందన్నారు. వైద్యం చేయడం వల్ల వారం రోజుల్లో కోలుకుంటుందని చెప్పారు. వైద్యం చేయించిన స్నేక్‌ సొసైటీ కృష్ణసాగర్‌ ఇంటి వద్దనే ఉంచుకుని బలమైన ఆహారం ఇస్తూ పశువైద్యశాఖ సిబ్బంది సూచన మేరకు అటవీశాఖ అధికారుల అనుమతితో పర్యవేక్షణలో ఉంచుకున్నారు. వైల్డ్‌ ఎనిమిల్స్‌ పరిధిలోకి వచ్చే ఈ గద్దకు అయిన గాయం మాని ఎగిరే వరకు చికిత్స అందిస్తామని, ఒకవేళ ఎగురలేకపోతే పక్షి రక్షణ కోసం హైదరాబాద్‌ ప్రాంతంలోని సంరక్షణ కేంద్రాలకు తరలిస్తామని చెప్పారు. అలాగే శుక్రవారం మదనాపురం మండలంలో గాయపడిన ఓ జింకపిల్లకు వైద్యం అందించినట్లు ఫారెస్ట్‌ అధికారి ప్రశాంత్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement