హత్యపై అనుమానాలెన్నో.. | Sakshi
Sakshi News home page

హత్యపై అనుమానాలెన్నో..

Published Sat, May 25 2024 12:35 PM

హత్యపై అనుమానాలెన్నో..

వనపర్తి/ చిన్నంబావి: రాష్ట్రస్థాయిలో రాజకీయ దుమారం రేపిన బీఆర్‌ఎస్‌ నేత లక్ష్మీపల్లి శ్రీధర్‌రెడ్డి హత్య కేసుపై పోలీసు ఉన్నతాధికారులు సైతం దృష్టిసారించారు. ఈ మేరకు శుక్రవారం ఐజీ సుధీర్‌బాబు వనపర్తి ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీస్‌ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి హత్య కేసును వీలైనంత త్వరగా ఛేదించాలని ఆదేశాలిచ్చినట్లు సమాచారం. అంత కంటే ముందే ఎస్పీ రక్షితా కె.మూర్తి ఘటనా స్థలాన్ని పరిశీంచడం, చిన్నంబావి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి అక్కడి అధికారులతో వివరాలు తెలుసుకోవడం, సాయంత్రం సుమారు 150 మంది పోలీసులతో లక్ష్మీపల్లిలో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించడం చకచకా జరిగిపోయాయి.

కరెంట్‌ పోయిందా.. తీశారా?

శ్రీధర్‌రెడ్డి హత్య ఘటన చోటుచేసుకున్న బుధవారం అర్ధరాత్రి గ్రామంలో విద్యుత్‌ సరఫరా అధికారికంగా నిలిచిపోయిందా.. లేక హత్య చేసేందుకు ప్లాన్‌ చేసుకున్న దుండగులు ఉద్దేశపూర్వకంగా విద్యుతత్‌ సరఫరా నిలిపివేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ హత్యగా ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీస్‌ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం.

ఆయుధాలెక్కడ..

శ్రీధర్‌రెడ్డిని హతమార్చేందుకు ఉపయోగించిన మారణాయుధాలు ఎక్కడ ఉన్నాయనేది ఇప్పటి వరకు తెలియలేదు. హత్య పక్కా ప్లానింగ్‌ చేశారనేందుకు దాడికి ఉపయోగించిన ఆయుధాలను వెంట తీసుకువెళ్లిన ఉదంతం బలం చేకూరుస్తోంది. ఈ విషయమై విచారణ అధికారి నాగభూషణరావును వివరణ కోరగా ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, గ్రామంలో సీసీ కెమెరాలు లేవని చెప్పారు.

● లక్ష్మీపల్లిలో గురువారం సీఐ నాగభూషణం ఆధ్వర్యంలో సుమారు 150 మంది పోలీస్‌ బలగాలతో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రా మంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అ నంతరం సీఐ మాట్లాడుతూ గ్రామంలో శాంతిభద్ర తలు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రతి ఒక్కరు సంయమనం పాటించాలని కోరారు.

● లక్ష్మీపల్లిలో అర్ధరాత్రి కరెంట్‌ కట్‌

● ఘటనా స్థలాన్ని పరిశీలించి ఎస్పీ

● వనపర్తి ఎస్పీ కార్యాలయంలో ఐజీ సమీక్ష

Advertisement
 
Advertisement
 
Advertisement