వేరుశనగ వైపు రైతన్నల దృష్టి | Sakshi
Sakshi News home page

వేరుశనగ వైపు రైతన్నల దృష్టి

Published Fri, May 24 2024 10:20 AM

వేరుశనగ వైపు రైతన్నల దృష్టి

వేరుశనగ సాగు ఈ ఏడాది గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. 2022–23లో ఎండుమిర్చికి ధరలు ఆశాజనకంగా ఉండటం వల్ల 2023–24లో మిర్చి రికార్డు స్థాయిలో సాగయింది. అయితే ధరలు మిర్చి రైతును నిరాశపరిచాయి. దీంతో మిర్చి రైతులు వేరుశనగపై దృష్టి సారిస్తున్నారు. వేరుశనగ సాధారణ సాగు 58,969 హెక్టార్లు ఉండగా.. 10–20 శాతం వరకు సాగు పెరిగే అవకాశం ఉంది. అయితే సబ్సిడీపై పంపిణీ చేసేందుకు వేరుశనగ కేవలం 13,929 క్వింటాళ్లు కేటాయించారు. ఇప్పటికే పలువురు ఏడీఏలు అదనంగా వేరుశనగ కావాలంటూ జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి ప్రతిపాదనలు పంపుతున్నారు.

వేరుశనగ విత్తనాలు తీసుకుంటున్న రైతు

Advertisement
 
Advertisement
 
Advertisement