నేత్ర పర్వంగా కూచిపూడి నృత్యాలు | Sakshi
Sakshi News home page

నేత్ర పర్వంగా కూచిపూడి నృత్యాలు

Published Tue, Apr 16 2024 2:25 AM

నృత్యం ప్రదర్శిస్తున్న కళాకారులు  - Sakshi

విజయవాడ కల్చరల్‌: శ్రీరామనవమి సందర్భంగా ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థా కళాపీఠం ఆధ్వర్యంలో మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాలలోని వేదికపై సోమవారం కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ఆకట్టుకున్నాయి. నాట్యాచార్యుడు అజయ్‌కుమార్‌ శిష్యబృందం శ్రీ రాఘవం నృత్య కార్యక్రమాలు శ్రీ రామచంద్రుని వైభవాన్ని చాటాయి. శ్రీరాఘవంతో ప్రారంభించి బాలకనకమయ, రామనామము, రామాయణ శబ్దం, రామచంద్రుడితడు రఘు వీరుడు, గరడగమన రారా, రాముడు రాఘవుడు, ఇదిగో భద్రాద్రి అంశాలను ప్రదర్శించారు. నట్టువాగం శ్రీనివాస్‌, గాత్రం సుధా శ్రీనివాస్‌, మృదంగం పై శ్రీధరా చార్య, వయోలిన్‌పై చావలి శ్రీనివాస్‌, వేణువుపై కుమార్‌బాబు సహకరించారు. సిద్ధార్థ కళాశాల విద్యార్థిని కృష్ణ సేన ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆకట్టుకుంది. కళాశాల విద్యార్థినులు శ్రీరామునిపై భక్తి గీతాలు ఆలపించారు. కళాపీఠం బాధ్యలు ఎన్‌.లలిత్‌ ప్రసాద్‌, సాంస్కృతిక కార్యక్రమాల కార్యదర్శి బీవీఎస్‌ ప్రకాష్‌ కళాకారులను సత్కరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement